ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డికి మదిలో లండన్ ఒలింపిక్స్ తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్లిన గత కొద్ది రోజులుగా ప్రజా సమస్యలను పక్కన పెట్టి కొంతసేపు క్రికెటర్గా కోచ్ గా క్రీడాకారుడిగా అవతారం ఎత్తుతున్నారు. కాలేజీ స్థాయి వరకు మంచి క్రికెటర్గా ఆరోజుల్లో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ కుమార్ రెడ్డికి ఇన్నాళ్లకు మళ్లీ క్రీడల పట్ల ఆసక్తిని కనబరుస్తూ ఎదుటివారితో ముఖ్యంగా విద్యార్థుల్లో ఆ ఆసక్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో తెలుగుదేశం అధ్యక్షులు నారాచంద్రబాబునాయుడు కూడా ప్రతిక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని, వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించటానికి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించటానికి ఇతరులను డబ్బులిచ్చి తీసుకొచ్చి ఆడించేవారు మరి అధికారంలోకి వచ్చాక మాత్రం విద్యార్థులకు ఐటీ అంటూ ఆకాశంలో చుక్కలు చూపించారు. పైగా వారు రాజకీయాలకు దూరంగా ఉండాలని విశ్వవిద్యాలయాల్లో సైతం ఎన్నికలను నిషేధించారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా కొంత వరకు అదే పాట పాడుతున్నారు. దేశ జనాభాల్లో 40 శాతం మంది 25 సంవత్సరాలలొపు వయసు ఉన్న వారేనని, వారే దేశ భవిష్యత్ అంటూ వారికి తనదైన శైలిలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించటానికి ప్రయత్నిస్తున్నారు. పాఠశాలల్లో కచ్చితంగా ప్రతిరోజు స్పోర్ట్స్ క్లాస్ ఉండాలని ముఖ్యమంత్రి మొదటటి ఆదేశాన్ని జారీ చేశారు. కానీ, ప్రభుత్వ పాఠశాలలో నేటికి కూడా కింద నేలపై కూర్చోని నేలపై చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనీస సౌకర్యాలు లేక పిల్లలు కొట్టుమిట్టుడుతున్నారన్నది మర్చిపోతున్నారో ఏమో మరీ. ఇక క్రీడారంగానికి వస్తే మండలానికి ఒక స్టేడియం నిర్మిస్తామన్నారు. మరి రాజదానిలో గానీ, జిల్లా కేంద్రాల్లో గానీ ఇప్పడున్క స్టేడియంల నిర్వహణ, వాటి స్థితి గతులు ఎలా ఉన్నాయో తెలసుకుంటే బాగుంటుంది.  రాజదానిలో ఉన్న ఎల్పీ స్టేడియం ను రాజకీయ అవకాశాలకు వాడుకోగా, గచ్చిబౌలిలోని ఉన్న జిఎంసి బాలయోగి స్టేడియంను ప్రైవేట్ పరం చేసి సినిమా ఫంక్షన్లు, ప్రముఖుల పెళ్లిల కోసం ఉపయోగిస్తున్న విషయం కిరణ్ కుమార్ రెడ్డి తెలిసో తెలియదో మరి, మీద ఒలింపిక్స్కు రాష్ట్రం నుంచి సైనా నెహ్వల్, జ్వాల ముక్త వంటి క్రీడాకారిణీలు తప్పా మిగతా వాటిల్లో ప్రాతినిధ్యం లేక పోవటంతో కిరణ్ కుమార్ రెడ్డి కి బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైన చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి లకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని చూసి ప్రజలు సంతోషించాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: