2014 రాష్ట్ర రాజకీయ ఒలంపిక్స్ కు క్రీడాకారులు సిద్దమవుతున్నారు. పతకం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రీడలకు అర్హత సాధించిన పార్టీల టీంలన్నీ ప్రాక్టీస్ ను ముమ్మరం చేశాయి. ఓటింగ్ పద్దతిన జరిగే ఈక్రీడల విజేతల ఎంపిక కోసం పార్టీల పాట్లు మొదలయ్యాయి.విజేతకు అధికారం,రన్నరప్ కు ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఈసారి పోటి ఆసక్తికరంగా మారింది.ఒకప్పుడు టీంలు ఎన్నున్నా పోటి రెండింటి మద్యే ఉండేది. ఇప్పుడు పరిస్తితి మారి బహుముఖ పోటి నెలకొంది. అధికార పతకం పక్కాగా ఒక్కరికే దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో విజయం కోసం చేస్తున్న ప్రయత్నాలతో పాటు,పాట్నర్ల కోసం కూడా పాకులాట మొదలైంది. పతకం కోసం పెడుతున్న పరుగుల్లో అదికారపార్టీ అడుగులు తడబడుతున్నాయి. ఈటీం కెప్టెన్ ఎవరన్నదే వారికి పెద్ద సమస్య. తాత్కాలిక కెప్టెన్లతో పక్కా స్టెప్పులు వేయలేక ఇబ్బంది లో పడింది ఈజట్టు. దీంతో జట్టులోని క్రీడాకారులు ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లుగా,వారికి తోచినట్లుగా ఆడుతూ ప్రాక్టీస్ సెషన్ లోనే పరేషాన్ చేస్తున్నారు. ప్రస్తుత కెప్టెన్ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట పేరుతో జనంబాట పట్టారు. ఆయన ప్రసంగాలు,కురిపిస్తున్న హామీలు అన్ని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసేవిగానే ఉన్నాయి. అయితే తెలంగాణ నాయకులు ఎవరికి వారే ఇష్టారీతిన వ్యవహరిస్తూ, ఒక దశలో సిఎం వ్యాఖ్యలనే బహిరంగంగా విమర్శించడం తలనొప్పిగా తయారైంది.హనుమంతరావు లాంటి సీనియర్ నేతనే గాంధీభవన్ ఎదుట నిరసనకు దిగండం,మధుయాష్కి,పొన్నం ప్రభాకర్,వివేక్ వంటి ఎంపీలు హెచ్చరికలు జారీచేస్తున్నట్లుగా మాట్లడుతుండడం ఇబ్బందికరంగా తయారైంది. ఈసారి పతకం దక్కకపోతే పత్తాలేకుండా పోయేపరిస్తితి టిడిపిది. హైటెక్ మైండ్ తో ఓట్లవేటకు ప్లాన్ వేసి బిసి లపై ప్రేమను ఒలకబోయడం మొదలుపెట్టారు.సంఘాలతో సమావేశాలు,సన్మనాలతో వేదికలను ఏర్పాటు చేసుకుని చక్కటి హామీలతో బిసీలను బుట్టలో వేసుకునే పనిలో పడ్డారు. ఆయనకు బాసటగా ఎర్రంనాయుడు లాంటి సీనియర్లు కూడా ఆయన బాటలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తెలంగాణలో టీటిడిపి నేతలతో తెలంగాణ రాగాన్ని వినిపిస్తున్నారు.ప్రాజెక్టుబాట పేరుతో రైతులకు దగ్గరవుతూ, ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు ఫథకరచన కూడా టిడిపి చేసుకుంది. తెలంగాణపైనే దృష్టిపెట్టిన బిజేపి ఆదిశగా అడులు వేస్తోంది. ఉమాభారతితో కార్యక్రమం అందులో భాగమే. ఇక కొత్తగా రంగంలోకి దిగి ఉపఎన్నికల విజయంతో ఊపుమీదున్న వైకాపా విజయమ్మ నేతృత్వంలో దూసుకుపోతోంది. సిపిఐ తెలంగాణ వాదాన్ని మళ్లీ భుజానవేసుకుంది. లోక్ సత్తా సురాజ్య అస్త్రాన్ని తీసింది. మొత్తం మీద 2014 రాష్ట్ర రాజకీయ ఒలంపిక్స్ క్రీడల కోసం అన్నీ పార్టీలు పావులు కదుపుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: