హైదరాబాద్: ఉత్తర భారతం అంధకారంగా మారింది. కరంటు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పదకొండేళ్ల తరువాత ఉత్తరాది పవర్ గ్రిడ్ లో సమస్య తలెత్తింది. ఉత్తరాది పవర్ గ్రిడ్ లో తలెత్తిన సంక్షోభం వల్ట 12రాష్ర్టాల ప్రజలు చీకట్లో కాలం వెళ్లదీస్తున్నారు. కరంటు లేక ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఉత్తర భారతం కరంటును విపరీతంగా వాడుకుంటది. పవర్ గ్రిడ్ కుప్పకూలడంతో దేశ రాజధాని సహా ఉత్తర భారత దేశంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఆసుపత్రులలో సేవలు నిలిచిపోయాయి. తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తప్పడం లేదు. ఢిల్లీ మెట్రో రైలుతో పాటు ఇతర రాష్ర్టాల్లోనూ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఐటీ కంపనీల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. రైళ్లు నిర్ణీత సమయానికి నడవకపోవడం వల్ల విద్యార్థులు, ప్రభుత్వ, ప్రయివేట్ రంగ సంస్థల ఉద్యోగులు, సాధారణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.  దేశంలోనే భారీ విద్యుత్ ఉత్పాదన చేసే ఉత్తరాది పవర్ గ్రిడ్ సామర్ధ్యం 8వేల మెగావాట్లు. ఇంత పెద్ద పవర్ గ్రిడ్ లో వైఫల్యానికి కారణాలు ఏమిటో తెలియడం లేదు. ఎన్టీపీసీ లో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి సుషీల్ కుమార్ షిండే చెప్పినప్పటికీ ఇప్పటి వరకు వైఫల్యం ఏమిటనేది తెలియరాలేదు. పరిస్థితులు చక్కబడలేదు. కరంటు సంక్షోభంతో ఉత్తరాదికి చెందిన 12 రాష్ర్టాల ప్రజలు సతమతమవుతున్నా చేయాల్సినంత వేగంగా పనులు జరగడం లేదనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.  మొత్తానికి ఉత్తరాది పవర్ గ్రిడ్ కుప్పకూలిన కారణంగా ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. విద్యుత్ ను పునరుద్దరించడానికి సంబంధిత అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. కరంటు సంక్షోభం సగం దేశాన్ని చిమ్మని చీకట్లోకి తీసుకెళ్లింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: