ఆపరేషన్ గ్రీన్ హాంట్ లోనూ అన్నలు జనతల సర్కార్ పరిడవిల్లుతోంది... మావోయిస్టుల అగ్రనేత కిషన్ జీ ఎన్ కౌంటర్ అనంతరం అడవిలో అదనపు బలగాలు గాలింపులు ముమ్మరం చేసిన తరుణంలోనే మారుమూల పల్లెల్లో మావోయిస్టులు మళ్లీకదలాడుతున్నారు. అబుజ్ గూడ్ లాంటి నక్సలైట్ దుర్గాల్లో సైన్యం కవాతు చేస్లుంటే కోయకమాండర్ల చేతుల్లో విలవిలలాడిన అడవి గ్రామాలు అన్నల నీడన పదంపాడుతున్నాచ.  ఛత్తీస్ ఘడ్ లో గోదావరి అవతలి ఒడ్డు అడవి పరిస్థితి ఈ విషయాన్ని అద్దం పడుతోంది. గ్రీన్ హంట్ లోనూ అన్నలు తిరుగాడుతున్న తీరు... ఉత్తర తెలంగాణ ఇప్పడది అన్నలకు ఏమాత్రం ఉపకరించని ప్రాంతం ఆ స్థానం గోదావరి అవతల ఒడ్డు పల్లెలకు ఇప్పుడు పరిమితమైయింది. గోదావరి అవతలి ఒడ్డంతా అడవి... అడవి నడుమ చిన్న చిన్న పల్లెలు..  అపల్లెల్లో ఓ పక్క గ్రీన్ హంట్ పదఘటన... ఆ పధఘటనలు ఈ వెంటనే కాల్పులు వీటిన్నింటికి ఫాలో ఆఫ్ అన్నట్లు మళ్లీ హెలీకాప్టర్లలో అదనపు బలగాల మోహరింపు.... వెంటనే విచక్షణారహిత నిర్భందకాండ రెండేళ్లుగా నక్సలైట్ ప్రధాన స్థావరంగా పరణించడుతున్న ఛతీస్ ఘడ్, ఆంధ్ర, ఒరిస్సా, బార్డర్ వీటన్నీనిమించి అబుజ్మడ్ లో అన్నల కదలికలపై నిరంతర నిఘా.. దానికి తగినట్లు కొనసాగుతున్న నిర్భందం. ఈ దశలో గిరిజన పల్లెలు కకావికలమయ్యాయి.  గిరిజన చెట్టుకొకరు, పుట్టకొకరయ్యారు. రెండేళ్ల క్రితం వరకు కొనసాగిన జనతన సర్కార్ దాదాపుగా మటుమాయింది. పల్లెల్లో సాధారణ జనజీవనం అతలాకుతలమయింది. కిషన్ జీ ఎన్ కౌంటర్ కు ముందు ఉన్నస్థితి ఆ వెంటనే పిఎల్జీఏ వారొత్సావాలు... దానికోసం నక్సలైట్లు ఏర్పాట్లు, ఇవన్నీ పోలీసుల నిఘా మధ్య నీరసపడ్డాయని ప్రచారం. మావోయిస్టు అగ్రనేత మాల్లోజు కిషన్ జీ బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా అగ్రహించిన మావోయిస్టులు రెండు రోజుల తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. బంద్లో భాగంగానే మావోయిస్టులు వరంగల్ లో ప్రజాప్రతినిధుల, పలు కంపెనీలపై దృష్టి సారించినట్లు సమాచారం, దీంతో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నజర్ వేశారు. అడవుల్లో పోలీసుల పహారా నిర్వహిస్తున్నారని సమాచారం. అంతేకాదు అనుమానం ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. కిషన్ జీ ఎన్ కౌంటర్త తరవాత ఆగ్రహించిన మావోయిస్టులు ఏటూరునాగారం వద్ద కాలువ పనులునిర్వహిస్తున్న వారిని ఇద్దరిని కిడ్నాప్ చేశారు. అక్కడ ఉన్న పరికరాలకు నిప్పంటించారు. దీంతో ఉల్లిక్కిపడ్డ పోలీసులు అప్రమత్తమైనారు. అంతేకాదు జిల్లాలోని పోలీసులను ఏజెన్సికి తరలించారు. గత 30 ఏళ్లుగా విప్లవోద్యమంలో చురుకుగా ఉంటూ అంచెలంచెలుగా మావోయిస్టులో అగ్రనేతలున్నారు. తెలంగాణ జిల్లాకు చెందిన వారే ఎక్కువగా మావోయిస్టుల్లో ఉన్నారని సమాచారం. దీంతో కేంద్ర రాష్ట్రంలో తెలంగాణ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నాలుగు రాష్ట్రలలో తెలంగాణకు చెందినవారు ఎక్కవగా ఉన్నారని పోలీసులు వారిపై నిఘా పెట్టారని సమాచారం.  డిసెంబర్ ఒకటినుంచి ఉద్యమంలో అమరులైన మావోయిస్టులకు పెద్ద ఎత్తున సంస్మరణ సభలు నిర్వహిస్తారు. దీనికోసం ముందుగానే మావోల కదలికలను కనుపెట్టేందుకు ప్రత్యేకంగా పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. జిల్లానుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన మావోయిస్టులు వివిధ రాష్ట్రాల్లో విప్లవ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, పశ్చిమ బాంగాల్ దండకారణ్యంలో జిల్లాకు చెందిన పలువురు నాయకులు కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు.  అటవీ ప్రాంతాలను అజ్ఞాత కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకొని నక్సలైట్లు విస్తృతమవుతూ వచ్చారు. ఈ నేపధ్యంలో క్రమంగా పోలీసులు కూడా అణచివేత చర్యలు పరిధిని పెంచకుంటూ వస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: