మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ 'జంజీర్'కు సినిమా కష్టాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు 'జంజీర్' విడుదలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. సుప్రీం ఉత్తర్వుల కారణంగా 'జంజీర్' విడుదల ఆరు వారాల పాటు బ్రేక్ పడింది. సినిమా హక్కుల విషయమై అమిత్‌ మెహ్రా సోదరుల మధ్య గొడవ నెలకొంది. తమకు పూర్తిగా డబ్బు చెల్లించలేదని అమిత్‌పై సోదరులు కోర్టుకెక్కారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును అమిత్‌ సోదరులు ఆశ్రయించారు. దాంతో సుప్రీం తాజాగా ఈ తీర్పును వెలువరించింది. అమితాబ్ ప్రధాన పాత్రలో 1973లో వచ్చిన ‘జంజీర్' చిత్రం ఒరిజినల్ వెర్షన్‌ను అమిత్ మెహ్రా తండ్రి ప్రకాష్ మెహ్రా.. ‘ప్రకాష్ మెహ్రా ప్రొడక్షన్స్' బేనర్ పై నిర్మించాడు. అతని పెద్ద కుమారుడైన అమిత్ మెహ్రాకు సంబంధించిన అడయ్ మెహ్రా ప్రొడక్షన్స్ జంజీర్ చిత్రం రీమేక్ రైట్స్ కొనుగోలు చేసింది. అయితే అమిత్ మెహ్రా తన ఇద్దరు సోదరులకు.. రీమేక్ రైట్స్‌కు సంబంధించిన డబ్బులను చెల్లించలేదు. ఈ కారణంగా వారు కోర్టును ఆశ్రయించి తాజా 'జంజీర్'ను విడుదల కాకుండా స్టే తెచ్చుకున్నారు. అయితే అమిత్ మెహ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. దీంతో అతని సోదరులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆరు వారాల్లోగా వివాదం సెటిల్ చేసుకోవాలని సూచిస్తూ సుప్రీంకోర్టు స్టే విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: