LIVE UPDATES : NTR Statue In Parliament

తెలుగుతేజం నందమూరి తారకరామారావు విగ్రహాన్ని సోమవారం పార్లమెంట్ లో ఏర్పాటు చేయనున్నారు. ఆహ్వానాలు అందలేదని టిడిపి నేతలు చేసిన లొల్లికి ఫుల్ స్టాప్ పడింది. ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకోనున్నారు. టిడిపి అధినేత, మరికొందరు ముఖ్యనేతలు, తెలుగుదేశం ఎంపీలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

పార్లమెంట్ లో 9 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పార్టమెంట్ లో ఇదే అతిపెద్ద విగ్రహం కావడం విశేషం

రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు లోక్ సభ స్పీకర్ మీరాకుమారిని కలసి రాష్ట్ర మొదటి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు.

కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఎంపీలు కె.ఎస్. రావు, సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు సోనియాగాంధీని కలసి ఎన్టీఆర్ జాతీయస్థాయి నేత కాదని, పైగా ఆయన కాంగ్రేస్ కు వ్యతిరేకంగానే రాజకీయాలు నడిపారని, ఆయన విగ్రహం ఏర్పాటు చేయవద్దని పిటిషన్ ఇచ్చారు.

7am: ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మిపార్వతికి ఆహ్వానం అందలేదు, అయితే లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి మీరు వస్తే రావచ్చు అని ఫోన్ చేసి చెప్పారు.

పిలుపు రాకపోవడంతో లక్ష్మిపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసారు. నిజానికి ఎన్టీఆర్ కు ద్రోహం చేసింది చంద్రబాబు కాదని, కూతురు పురంధరీశ్వరే ఎన్టీఆర్ కు అసలైన ద్రోహం చేసిందంటూ ఆరోపించారు.

 9am: సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు డిల్లీ చేరుకున్నారు.

 10:15am: కాసేపట్లో పార్టమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, జూనియర్ ఎన్టీఆర్, బాలక్రిష్ణ, చంద్రబాబు, ఇతర కుటుంబసభ్యులు పార్లమెంట్ కు చేరుకున్నారు. విగ్రహావిష్కరన పట్ల ఎన్టీఆర్ సొంత జిల్లా క్రిష్ణా జిల్లా వాసులు ఆనంద వ్యక్తం చేసారు. పలువురు స్థానికులు మాట్లాడుతూ ఎన్టీఆర్ తో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు
10:30am: పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్పీకర్ మీరాకుమారి ఆవిష్కరించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, అధ్వాని, కేంద్రమంత్రులు ఆజాద్, జైరాంరమేష్, చిరంజీవి,జైపాల్ రెడ్డి,షిండే, కిల్లి కృపారాణి, చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, బాలక్రిష్థ, కళ్యాన్ రాం, ఎంపీలు గుత్తా, మాగంటి, లగడపాటి దంపతులు, ఫరూక్ అబ్దుల్లా ,  ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి, కుటుంబసభ్యులు తదితరులు హాజరయ్యారు.

10:55am: సోనియాగాంధి రాకపోవడాన్ని రాజ్యసభ సభ్యుడు హన్మంతరావు సమర్థించారు. ఎన్టీఆర్ ఇందిరాగాంధి, రాజీవ్ గాంధి, కాంగ్రేస్ పార్టీని విమర్శించారు, అందుకే ఆమె హాజరుకాలేదని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: