దేశంలోనే  మొట్టమొదటిసారిగా శాసనసభ వెబ్ సైట్ ను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.  ప్రస్తుతం ఉన్న శాసనసభ పాత భవనం అప్పటి నిజాం హయాంలో 1913 లో టౌన్ హాల్ గా నిర్మించారు. ఆ తర్వాత 1952 వరకు హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీగా ఆ భవనాన్ని మార్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956 నుంచి 1985 వరకు రాష్ట్ర శాసనసభగా ఆ భవనం సేవలందించి. ఇలాంటి సమగ్రమైన సమాచారాన్ని వెబ్ సైట్లో పొందుపర్చారు. దీంతో పాటు రాష్ట్ర చరిత్ర సభా విరామ నిబంధనలు, సభా పనితీరుపై సభ్యులకు కావాల్సిన సమాచారం ఆన్లైన్ ద్వారా తెలసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేయడమైనది.  అలాగే తమ నియోజకవర్గంలో చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఫించన్లు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, స్కాలర్ షిప్లు వంటి సంక్షేమ పథకాల కేటాయింపులు, లబ్ధిదారుల వివరాలను ప్రజాప్రతినిధులు తెలుసుకోవచ్చు. రాజ్యంగం దానిలో ఉన్న అధికరణ, చట్టాలు, 1956 నుంచి సభలో ప్రముఖులు చేసిన ప్రసంగాలు ఉభయసభలనుద్దేశించి గవర్నర్లు చేసిన ప్రసంగాలు, వంటి అంశాలు మొదటి సభ నుంచి వెబ్ సైట్ లో పొందుపర్చారు. ఈ ప్రక్రియ దేశంలో మొదటిసారిగా చేపట్టడమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: