విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించాలా వద్దా అన్న కొత్త అంశానికి తెరలేపారు మన పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్చదర్శి చందనాఖాన్, పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లను ఉపయోగించిన తర్వాత నీళ్లు పోసి శుభ్రంగా ఉండాలన్నదే ఆమెదే కాకుండా ప్రతిఒక్కరి ఉద్దేశం.  పాఠశాలల్లో స్వీపర్లు నియామకం, రూ. 33 కోట్ల ఖర్చుచేస్తూ కొత్తగా 25 వేల మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వం ఏమి సంకల్పించిన అది దాని బాధ్యత, కానీ విద్యార్థలే తమ పాఠశాల మరుగుదొడ్లును శుభ్రం చేసుకోవాలన్న ఆలోచనపై మంచిచెడులను మాటకు వస్తే ఆమె చేసిన ప్రతిపాదన ఒక్కంతకు బాగానే ఉంది. దేశలో చాలా కాలంగా ఒక అంశంపై రచ్చ జరుగుతుంది. అదేమిటంటే 12వ, తరగతి వరకు పిల్లలకు మలిటరీ శిక్షణ ఇవ్వాలని, ఇలా చదువుతోపాటు మిలిటరీ శిక్షణ కోసం రోజు రోజు ఒక క్లాస్ ను కేటాయిస్తే పిల్లల్లో దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని అభిప్రాయం చర్చల్లొ ఉంది మిలిటరీ శిక్షణ అంటే క్రీడలు, మరుగుదొడ్లు శుభ్రం ఇతర అన్ని పనులు గురించి బాధ్యతను గుర్తుచేయడమే అయితే ప్రభుత్వం కోట్లు ఖర్చుచేసి మరగుదొడ్లను నిర్మిస్తున్న మెహార్చానీ వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద, మధ్యతరగతికి పిల్లలకే ఈ ఆలోచనను వర్తింపజేయాలో లేక ప్రైవేటు, ప్రభుత్వం పేదలు, సంపన్నులన్న లేడా లేకుండా ఇలాంటి భాధ్యతను అందరికీ అప్పగించాలన్నదే ప్రధానమైన అంశం.  భారతదేశం ఇంకా కొంత వరకు సంక్షేమరాజ్యాంగానే కనసాగుతుంది. అందుచేత పౌరులందరు దేశం సమాజం, చట్టం ముందు ఒక్కటే అన్న సూత్రం అందరికీ వర్తిస్తుంది. పాఠశాలల్లొ పిల్లలు మరుగుదొడ్లను వారే శుభ్రం చేసుకోవడం అంటే దేశంలో నేటికి కొనసాగుతున్న దొడ్డిని చేతులతో ఎత్తివేసే (మ్యానువల్ స్కావెంజర్స్) వ్యవస్థను కనీసం 60 సంవత్సరాలు దాటిపోయిన స్వాతంత్ర్య భారతదేశంలో ఈ ఇలలాంటి చర్యల వల్ల నిర్మూలించటానికి ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: