పెద్దనోట్ల రద్దు.. భారత దేశంలో ఈ మధ్య కాలంలో ఇంతగా చర్చ జరిగిన అంశం మరొకటి ఉండదేమో.. ఈ అంశంపై ఎన్నో అనుకూల, ప్రతికూల కథనాలు.. దేశీయ, విదేశీ నిపుణుల అభిప్రాయాలు.. సామాజిక మాధ్యమాల్లో చర్చోపచర్చలు.. ఇలా ఇదో హాట్ టాపిక్ గా వార్త్లల్లో నిలిచింది. ఐతే దేశీ, విదేశీ మాధ్యమాల్లో మాత్రం దీనిపై ప్రతికూల కథనాలే ఎక్కువగా వచ్చాయి. 



చైనా పత్రిక దీన్ని ఓ సాహసోపేత నిర్ణయంగా వర్ణించింది. ఆ మధ్య ఫోర్బ్స్ పత్రిక దీన్ని అనైతిక చర్యగా వర్ణించిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక 
ఈ డీమోనిటైజేషన్ పై ఘాటుపదజాలంతో విమర్శలు గుప్పించింది. నల్లధనం, అవినీతిపై పోరు పేరిట ప్రభుత్వం పెద్ద నోట్లను ఆకస్మికంగా రద్దు చేయడాన్ని తీవ్రంగా ఎండగట్టింది. 



నోట్ల రద్దు ఐడియా, ఇంప్లిమెంటేషన్ ను మొత్తం కార్యక్రమాన్ని అరాచకమైన చర్యగా న్యూయార్క్ టైమ్స్ వర్ణించింది. పెద్ద నోట్ల రద్దు, నగదు కొరతతో భారతీయుల జీవితాలు దుర్భరంగా మారాయని తన ఎడిటోరియల్ లో కామెంట్ చేసింది. ఇంత చేసినా.. నల్లకుబేరులను గుర్తించడం, అవినీతి తగ్గడంకానీ జరగలేదని కామెంట్ చేసింది. 



నోట్ల రద్దు జరిగి రెండు నెలలు గడుస్తున్నా ఇండియన్ ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడిన పడలేదని న్యూయార్క్ టైమ్స్ రాసింది. నగదు కోసం జనం గంటల కొద్దీ పడిగాపులు పడాల్సి వచ్చిందని ఆ పత్రిక పేర్కొంది. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తాన్ని రద్దు చేసేస్తే.. ఏ ఆర్థిక వ్యవస్థా కూడా తీవ్ర ఇబ్బందులకు గురికాకుండా ఉండదని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: