అమెరికా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జుట్టు రష్యా చేతికి చిక్కిందా.. నాలుగేళ్ల క్రితం మాస్కో పర్యటనలో ట్రంప్ వేశ్యలతో విపరీతమైన లైంగిక చర్యలకు పాల్పడిన వీడియోలు రష్యా చేతిలో ఉన్నాయా.. వాటిని అడ్డం పెట్టుకుని రష్యా ట్రంప్ ను ఓ ఆటాడిస్తుందా.. ఇప్పుడు ఈ కథనాలు అమెరికన్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. 

Image result for trump sex videos

రష్యాలో ట్రంప్ జల్సాలకు సంబంధించిన రహస్య వీడియోలు రష్యా చేతిలో ఉన్నాయన్న విషయాన్ని అమెరికా నిఘా సంస్థల నివేదిక బయటపెట్టింది. ఈ మేరకు గత ఏడాదే బ్రిటిష్ మాజీ నిఘా అధికారి ఒకరు నివేదిక అందించారట. అధ్యక్ష ఎన్నికలకు ముందు నుంచి ఈ వ్యవహారంపై లీకులు వస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఈ నివేదిక సారంశాన్ని నిఘా సంస్థలు ఒబామా, ట్రంప్‌లకు వివరించినట్టు తెలుస్తోంది. 

Image result for trump sex videos

ఈ మొత్తం వ్యవహారాన్ని బజ్ఫీడ్ అనే వార్తా వెబ్‌సైట్ మంగళవారం డిటైల్ గా ప్రచురించింది. వాస్తవానికి ఇలాంటి నివేదిక ఒకటి ఉందని సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ కూడా కథనాలు ప్రచురించాయి. ట్రంప్ పై మొదటి నుంచి రష్యా ఏజంట్ అన్న ఆరోపణలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా మరో పది రోజుల్లో బాధ్యతలు చేపట్టనుండగా ఇలాంటి షాకింగ్ విషయాలు వెలుగుచూడటం ఆసక్తి రేపుతోంది. 

Image result for putin
డొనాల్డ్ ట్రంప్ 2013లో మాస్కోలోని ఒకహోటల్లో బస చేసినపుడు పలువురు వేశ్యలతో అసాధారణ రీతిలో లైంగిక కార్యకలాపాలు కొనసాగించాడట. ఈ వీడియా దృశ్యాలు రష్యా చేతికి చిక్కాయట. ఈ వీడియోలను అడ్డుపెట్టుకుని రష్యా ట్రంప్ ను ట్రాప్ చేస్తోందని.. గత ఎన్నికల్లోనూ సహకరించిందని అంటున్నారు. ట్రంప్‌ సెక్స్ రాకెట్ సీక్రెట్స్ తమ ఉద్ద ఉన్న విషయాన్ని రష్యా గూఢచారులు ఆయనకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ.. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆద్యంతం ఆయన ఎలా వ్యవహరించాలో చెబుతూ నడిపించారట. ట్రంప్ ఈ ఆరోపణలను బూటకపు వార్తలుగా కొట్టిపారేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: