అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ అధికారంలోకి వచ్చిన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌  దేవుడు కూడా ఇవ్వలేనన్ని ఉద్యోగావకాశాలను ఇచ్చి చూపిస్తానని హామీ ఇస్తున్నారు. నిఘా సంస్థలు సైతం తనకు వ్యతిరేకంగా ఉన్నాయని, అవే మీడియాకు లీకులిస్తున్నాయని ఆరోపిస్తూ, అదే నిజమైతే, ఆయా సంస్థల చరిత్రలో మాయని మచ్చలు పడ్డట్టేనని అన్నారు. రష్యా వద్ద తన సీక్రెట్స్ ఉన్నాయని వచ్చిన వార్తలపై స్పందిస్తూ, అంతా కట్టుకథని, ఈ తరహా ఆరోపణలు చేసి అధ్యక్షుడిని అవమానిస్తున్నారని విమర్శించారు. 


అందరి లెక్కలు తేలుస్తాం: ట్రంప్

ఎన్నికల్లో గెలిచిన తరువాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ట్రంప్, రష్యాతో తనకు సంబంధాలు లేవని, పుతిన్ తనను ఇష్టపడుతున్నారంటే, అది అమెరికాకు సానుకూలాంశమేనని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 90 రోజుల సమయంలో అందరి లెక్కలు తేలుస్తానని మరో ఎనిమిది రోజుల్లో అధ్యక్ష పదవి చేపట్టనున్న ట్రంప్ వ్యాఖ్యానించారు. హ్యాకింగ్ విషయంపై తాను దృష్టిపెట్టినట్లు పేర్కొన్న ట్రంప్.. యాంటీ హ్యాకింగ్ టీమ్ ఏర్పాటుచేసి ఎన్నికల సమయంలో జరిగిన సైబర్ దాడుల వివరాలను ప్రజలకు తెలియజేస్తానని తెలిపారు.


Image result for trump

ప్రతిరోజు అమెరికా అధికారిక, అనధికారిక వెబ్‌సైట్లను రష్యాతో పాటు చైనా, మరికొన్ని దేశాలు హ్యాక్ చేయాలని తీవ్రంగా యత్నిస్తాయని ఆరోపించారు.  సైబర్ సెక్యూరిటీని పూర్తిస్థాయిలో మెరుగు పరిచి ఏ దేశానికి హ్యాకింగ్ చేయడానికి అవకాశం లేకుండా చేస్తాం. 90 రోజుల్లో హ్యాకింగ్ కు గురయిన డేటా వివరాలపై పూర్తిస్థాయి నివేదిక రూపొందిస్తాం' అని డొనాల్ట్ ట్రంప్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: