రెండు నెలలు దాటినా నోట్ల కోసం బ్యాంకులు వద్ద పడిగాపులు పడుతున్న జనాలను చూసి.. బ్లూమ్ బర్గ్ న్యూస్.. అసలీ సమస్యకు మూలాలు కనిపెట్టాలని భావించింది. ఇందుకు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుంది. నోట్ల రద్దుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆర్బీని కోరింది. సూటిగా ప్రశ్నకు సమాధానం చెప్పలేని ఆర్బీఐ.. పొంతన లేని సమాధానలు చెప్పి బ్లూమ్ బర్గ్ న్యూస్ కు చుక్కలు చూపించింది. 


పెద్దనోట్ల రద్దుకు సంబంధించి నవంబర్ 8 ప్రకటన వెలువడిన దగ్గర్నుంచి జనవరి 2వ తేదీ వరకు జరిగిన ఘటనపై పూర్తి సమాచారం కావాలంటూ బ్లూమ్ బర్గ్ న్యూస్ ఆర్టీఐ ద్వారా ఆర్బీఐను కోరింది. బ్లూమ్ బర్గ్ న్యూస్ మొత్తం 14ప్రశ్నలు సంధించగా.. ఆర్బీఐ ఐదు ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చింది. అవి కూడా పొంతనలేని సమాధానాలిచ్చింది. నోట్ల రద్దుపై బోర్డు ఎప్పుడు నిర్ణయం తీసుకుందో చెప్పిన ఆర్బీఐ.. కమర్షియల్ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం ఎంతఅన్న ప్రశ్నకు మాత్రం తమ వద్ద సమాధానం లేదని తెలిపింది. 


నోట్ల రద్దుకు ఆర్బీఐ ఎందుకు అంగీకరించిందన్న ప్రశ్న ఆర్టీఐ కిందరి రాదంటూ సమాధానమిచ్చింది. అలాగే మరో రెండు ప్రశ్నలను కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ లకు పంపింది. నోట్ల రద్ద నిర్ణయాన్ని ఎంత మంది బోర్డు సభ్యులు ఆమోదించారన్న ఒక్క ప్రశ్నను బ్లూమ్ బర్గ్ సంస్థ మూడు సందర్భాల్లో ప్రశ్నించగా.. ఆర్బీఐ నుండి మూడు సార్లు వేర్వేరు  సమాధానమొచ్చింది. ఒకసారి ఏకగ్రీవమని, మరోసారి నో ఇన్ఫర్మేషన్ అంటూ ఇలా పొంతనలేని జవాబులిచ్చింది.


నోట్ల రద్దు ప్రకటన చేయకముందు వరకు బ్యాంకుల్లో పాత నోట్లు ఎంత వరకు ఉన్నాయన్న ప్రశ్నకు మినహాయింపు ఇవ్వాలంటూ బ్లూమ్ బర్గ్ న్యూస్ ను కోరింది. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేమని, అవి చెబితే రిజర్వ్ బ్యాంకు ప్రాణాలకు హాని అని ఆర్బీఐ పేర్కొంది. మరికొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తే దేశ భద్రతకు ముప్పు అంటూ కుంటిసాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: