khaidi no 150 images కోసం చిత్ర ఫలితం

ప్రభుత్వం ప్రసారమాధ్యమాల మైత్రి చిరస్మరణీయం ఒకరు చేసే అన్యాయాన్ని మరొకరు ప్రస్నించరు. స్వార్ధ ప్రయోజనమే పరమార్ధమా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రసారమాధ్యమం చాలా బలంగా ఉంది. తిమ్మిని బమ్మిని చేసి చూపించడం తెలుగు మీడియాకు వెన్నతో పెట్టిన విద్య అన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలో మీడియా చంద్రబాబుకు, ఆయన పార్టీకి ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా  పనిచేస్తోందన్న ఆరోపణ బలంగా ఉంది. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా విడుదలైన రెండు భారీచిత్రాల విషయం లోనూ ఈ మాధ్యమం ఏకపక్షంగా వ్యవహరించిందన్న విమర్శలు వస్తున్నాయి.


అటు ప్రభుత్వం కూడా ఒక చిత్రంపై వివక్ష చూపిందన్నది, అదొక కేంద్ర ఆంధ్ర ప్రభుత్వ అధికార సినిమాగా ప్రచారం, వ్యాపార ప్రోమోగా మార్చారని  ప్రధాన ఆరోపణ. జనవరి 11 న మెగాస్టార్ చిరంజీవి "ఖైదీ నంబర్ 150" చిత్రం విడుదలైంది. పదేళ్ల అంతరానతరం నటించిన చిత్రం అది. అలాంటి సినిమాకు మీడియా పోటీ పడి ప్రచారం కల్పిస్తాయని భావించారు. కానీ చిరంజీవి చిత్రం విడుదలైన రోజు ఏ మీడియా సంస్థ కూడా ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.


ap government & telugu main media  eenaadu కోసం చిత్ర ఫలితం

సినిమా ఎలా ఉందంటూ థియేటర్ల దగ్గరకు వెళ్లి ప్రేక్షక సమూహాల ముందు మైక్‌లు పెట్టి  అడగలేదు. కానీ బాలకృష్ణ చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి" విడుదలైన జనవరి 12 న  మాత్రం మీడియా ఛానళ్ల హడావుడి ఆకాశానికి అంటింది. ప్రతి బులిటెన్‌లోనూ శాతకర్ణి చిత్రానికి సంబంధించి హెడ్‌లైన్లు కనిపించాయి. థియేటర్ల దగ్గర అభిమానుల హంగామాను గంటల తరబడి చూపించారు. సినిమా సూపర్ డూపర్ హిట్‌ అంటూ ప్రేక్షకుల కంటే ముందుగానే టీవీ ఛానళ్లు ప్రకటించేశాయి. 


ఐతే చిరంజీవి సినిమా విషయంలో మాత్రం తెలుగు టెలివిజన్ ఛానళ్లు తమకేమీ తెలియదన్నట్టు సైలెంట్‌గా ఉండిపోయాయి. సరే గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం తెలుగు సామ్రాట్ చరిత్రకు సంబంధించినది కాబట్టి మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిందనుకుందాం! కానీ ఎప్పుడో రాజుల సంగతి దేవుడెరుగు ఇప్పుడు అన్నం పెట్టే రైతు … కార్పొరేట్ శక్తులకు బలైపోతున్నాయి. ఆ అంశాన్ని చిరంజీవి తన సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. కాబట్టి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తే గతించిన రాజుల చరిత్రకు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుందా? లేక నేడు కళ్లముందే కుంగి కృసించిపోతున్న రైతుసోదరుల సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందా? అన్నదే ప్రశ్న, అలోచించవలసిన విషయం.

rudramadevi & GPSK movies కోసం చిత్ర ఫలితం

కానీ ఇక్కడ అసలు నిజం ఏమిటంటే, ప్రస్తుతం మీడియాను నడుపుతున్నది కూడా "కార్పొరేట్" శక్తులే. పైగా చిరంజీవి తన సినిమాలో రైతుల భూములను ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ఎలా లాక్కుంటున్నాయో చూపించారు. ఆ ధోరణికి వ్యతిరేకంగా గళం విప్పారు. చిరు సినిమాలో సన్నివేశాలకు రాజధాని  అమరావతి, పోర్టులు, పరిశ్రమల నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల నుంచి భూములు లాక్కుంటున్న విధానానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. చిరు చిత్రం చూస్తే ఏపీలో రైతులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నించినట్టుగా అనిపిస్తుంది. బహుశా ఈ విషయం తెలిసే కాబోలు చిరంజీవి సినిమా "ప్రీ రిలీజ్ ఫంక్షన్‌" కు కూడా చంద్రబాబు ప్రభుత్వం విజయవాదలోని ఇందిరా గాంధి మునిచిపల్ స్టేడియం లో నిర్వహించుకోవటానికి న్యాయస్థానాల సాకు చూపి అనుమతి ఇవ్వలేదు.

 GPSK movies కోసం చిత్ర ఫలితం

చివరకు ప్రైవేట్‌ సంస్థకు చెందిన గ్రౌండ్‌ లో ఫంక్షన్‌ నిర్వహించుకోవాల్సి వచ్చింది. బాలకృష్ణ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం, మీడియా ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పేందుకు మరో విషయం కూడా ఉంది. గతంలో తెలుగు నేలను పాలించిన కాకతీయ రాణి  "రుద్రమదేవి" జగమెరిగిన చరిత్రను "గుణశేఖర్" తెరకెక్కించారు. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆ చిత్రానికి పన్ను రాయితీ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నా పన్ను మినహాయింపు ఇవ్వలేదు. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి మాత్రం చంద్రబాబు వెంటనే పన్ను రాయితీ ఇచ్చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణితో పాటు రైతుల స్థితిగతులను చాటిచెప్పేందుకు సామాజిక బాధ్యతతో తీసిన ఖైదీ నెంబర్‌ 150 చిత్రానికి కూడా అలాంటి పన్ను రాయితీలు ఎందుకు ఇవ్వకూడదన్నది చాలా మంది సంధిస్తున్న ప్రశ్న. కానీ వివక్షే వినసొంపు గా పాలన సాగుతున్న తెలుగు నేలపై ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వాలు స్పందిస్తాయని కూడా ఆశించడం దురాశే. మొత్తం మీద చిరంజీవి చిత్రం విషయంలో ప్రభుత్వం, మీడియా వివక్ష చూపిన మాట మాత్రం వాస్తవం.

సంబంధిత చిత్రం

“వివక్షల పాలన సతత హరితమవ్వదని, సమయం రాగానే హరితం మాడి ఎండుగడ్డి కాగలదనేది జగమెరిగిన సత్యం” దీన్ని విజ్ఞులైన పెద్దలకు పెద్దగా వివరించనవసరం లేదు. కాబట్టి వివక్షలు మానేసి కనీసం తెలుగునేలను నలుచెరగులా కలగలిపి సుపరిపాలనతో పాటు సుసంపన్న ప్రజాజీవితం అందించిన మనకు తెలిసిన చరిత్రను అవమానించటం ప్రభుత్వానికి ప్రతిష్ఠ తెస్తుందా! ఏదో తెలియని చరిత్రకందని గౌతమిపుత్ర శాతకర్ణికి ఇచ్చినంత కాకపోయినా ప్రజలకు నచ్చిన, తెలిసిన "రుద్రమదేవి" సినిమాకు కూడా వినోదపు పన్ను రద్దు చేస్తే ఉభయతారకంగా గౌరవ ప్రతిస్థలు మసక బారకుండానైనా ఉంటుందని ప్రజల మనవి.

GPSK  and Rudrama కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: