passport of germany కోసం చిత్ర ఫలితం

ప్రపంచంలో అత్యంతశక్తిమంతమైన పాస్‌పోర్టు జర్మనీదేశానికి ఉందట. ఒక పాస్‌పోర్టు మాత్రమేఉండి, ముందుగా వీసా తీసుకోకుండా (వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ ఎరైవల్‌ తో) ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశం ఆధారంగా వివిధ దేశాల పాస్‌పోర్టులకు స్కోర్లు, ర్యాంకులను ఆర్టన్ కేపిటల్ సంస్థ ప్రకటించింది.

passport of germany కోసం చిత్ర ఫలితం

అందులో జర్మనీ 157 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలోని సింగపూర్ 156 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి అంతకుముందు ఆ స్థానంలో ఉన్న దక్షిణకొరియాను వెనక్కి నెట్టింది. ఇక మన దేశానికి ఈ విషయంలో స్కోరు 46 మాత్రమే వచ్చి 78వ స్థానంలో నిలిచింది. కానీ చైనా, పాకిస్థాన్ దేశాల కంటే మాత్రం మనం చాలా ముందున్నాం. అవి ఇంకా వెనకబడ్డాయి.

passport of germany కోసం చిత్ర ఫలితం

మొత్తం ఎన్ని దేశాల పాస్‌పోర్టులను పరిశీలించారన్న విషయాన్ని ప్రస్తావించలేదు గానీ, అఫ్ఘానిస్థాన్ మాత్రం కేవలం 23 స్కోరుతో జాబితాలో అట్టడుగున నిలిచింది. వివిధ దేశాలు తమ దేశానికి ఫలానా దేశం నుంచి వీసా ఆన్ ఎరైవల్ సదుపాయా న్ని కల్పిస్తాయి. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం పలు దేశాలకు ఈ సదుపాయా న్ని కల్పించగా, ప్రతిగా మరిన్ని దేశాలు మనవాళ్లకు వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యం ఇచ్చాయి. దీని వల్ల ప్రయాణానికి ముందే వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా అక్కడకు వెళ్లిన తర్వాత విమానాశ్రయాల్లో ఉండే ప్రత్యేక కౌంటర్లలో విజిటర్స్ వీసా తీసుకోవచ్చన్న మాట.

passport of india image కోసం చిత్ర ఫలితం


మరింత సమాచారం తెలుసుకోండి: