రాజధాని రాకతో తమ భూముల ధరలు ఎంతగానో పెరిగాయని ఆనందంలో ఉన్న రైతులను.. వివిధ రూపాల్లో రె చ్చగొట్టేందుకు జగన్‌ ప్రయత్నించడం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి నిమ్మల చినరాజప్ప అన్నారు. జగన్‌ ఆరు నెలలకొకసారి నిద్ర నుంచి లేచినట్టు ఎక్కడో ఒకచోట ధర్నా చేసి మళ్లీ మౌనం దాలుస్తుంటారని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. పచ్చగా ఉన్న అమరావతికి జగన్ అనే చీడ పురుగు పడుతోందని ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. రాజధాని ప్రాంతాల పర్యటనకు జగన్ వెళ్తే, అక్కడి రైతులే ‘గో బ్యాక్’ అంటూ నిరసనలు తెలుపుతున్నారని విమర్శించారు. 


Image result for devineni uma

పంటకు పట్టిన చీడపురుగును పిచికారి చేసి ఏ విధంగా తొలగిస్తారో... ఆదే విధంగా ఆయనని రైతులు తొలగిస్తారు’’ అని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగంగా దేశ, విదేశాల్లో పెట్టుబడుల కోసం, రాజకీయ నేతలతో, కంపెనీల సీఈవోలతో క్షణం తీరిక లేకుండా సీఎం చంద్రబాబు గడుపుతుంటే... జగన్‌ మాత్రం సచివాలయం ఎదురుగా నిల్చుని రాజధానిలో ఇటుకను కూడా నిర్మించలేదని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.


Image result for devineni uma

రాజధాని ప్రాంతంలో రోడ్ల కింద పోతున్న 492 ఇళ్లకు నష్టపరిహారంగా భూమికి భూమి, కౌలు రైతులయితే 25 వేల మందికి పెన్షన్లు ప్రభుత్వం ఇస్తుందని గుర్తు చేశారు. ఇవేవీ తెలియని జగన్‌.. నెలకొక్కసారి రాజధాని ప్రాంతానికి వచ్చి ముఖ్యమంత్రిపై బురదజల్లే కార్యక్రమం చేపడుతున్నారన్నారు. ‘‘మా ప్రాంతంలో పర్యటించవద్దని రైతులు జగన్‌ని అడ్డుకుంటున్నారు. ఇదీ ఆయనకు ఉన్న జనాదరణ.’’ అంటూ ఎద్దేవా చేశారు.  ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి యత్నించిన అంశాన్ని ప్రస్తావించారు. సచివాలయానికి వెళ్తున్న అఖిల ప్రియను ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవాలని చూశారని, దీనికి బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: