తమిళనాడు లో ఈ మద్య ప్రతి ఒక్క అంశం సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి.  గత సంవత్సరం భయంకరమైన తుఫాను, వరదబీభత్సం..తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హాస్పిటల్ సంఘటనలు..ఆమె మరణం ఆ తర్వాత అన్నాడీఎంకే పగ్గాలు ఎవరు చేపడతారు అన్న అంశం ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సమస్య సోషల్ మీడియాను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా తెరపైకి జల్లికట్టు నిషేదం తొలగించాలని తమిళనాడు ప్రజలు, రాజకీయ నాయకులు, సిని ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపై నడుస్తున్నారు.

 రాష్ట్రంలో సాంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ భారీ స్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు తమిళ ప్రజలు. చెన్నైలోని మెరీనాబీచ్ లో నిరసనలు హోరెత్తుతున్నాయి. జల్లికట్టు కోసం జరుగుతున్న ఆందోళనకు మద్దతిచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అంతే కాదు  జల్లికట్టుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగోరోజు నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ ప్రజలు స్వచ్ఛంధంగా బంద్ పాటిస్తున్నారు. విద్య,వ్యాపార, వాణిజ్యముదాయాలు మూతపడ్డాయి.
Image result for jallikattu bandh
ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నారు. డీఎంకే కార్యకర్తలు రైల్‌రోకో చేస్తున్నారు.  సినిమా షూటింగ్‌లను సైతం నిలిపివేశారు. కాగా శుక్రవారం తమిళనాడు రాష్ట్ర బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి… విద్యార్థులు తలపెట్టిన బంద్‌కు డీఎంకే మద్దతు ప్రకటించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: