up mahakutami కోసం చిత్ర ఫలితం

ఉత్తరప్రదేశ్‌లో మహా కూటమి ఏర్పాటు ప్రయత్నాలకు “ఆదిలోనే హంసపాదు” ఎదురైంది. మహా కూటమిలో తాము చేరడం లేదని ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్ సింగ్‌ స్పష్టం చేశారు. తాము కోరిన సీట్లు ఇస్తేనే కూటమిలో చేరతామని రాష్ర్టీయ లోక్‌దళ్‌ భీష్మించుకు కూర్చొంది. తమకు బలం లేని చోట సీట్లు కోరుతున్న ఆర్‌ఎల్‌డీని కూటమి నుంచి బయట పెట్టడమే మంచిదని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ భావించారు.


గురువారం పార్టీ సీనియర్‌ సభ్యులతో ఆరు గంటలపాటు చర్చలు జరిపిన అఖిలేశ్‌ ఆర్‌ఎల్‌డీని కూటమిలోకి చేర్చుకోకూడ దన్న నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలి పాయి. తాము కాంగ్రె్‌సతోనే పొత్తు పెట్టుకుంటున్నామని, ఆర్‌ఎల్‌డీని సంకీర్ణంలో కలుపుకోవడం లేదని సమాజ్‌వాదీ పార్టీ తేల్చి చెప్పిం ది. ‘‘వాళ్లతో చర్చలేవీ జరగడం లేదు. 300 లకు పైగా సీట్లలో మేం పోటీ చేస్తాం. మిగిలిన వాటిలో కాంగ్రెస్‌ బరిలోకి దిగుతుంది’’ అని ఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయి నందా తెలిపారు.

akhilesh yadav & ajith singh కోసం చిత్ర ఫలితం

మొదటి రెండు దశలకు ఎస్పీ అభ్యర్థుల నిర్ణయం అయిపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ నిర్ణయించాల్సి ఉందని రాహుల్‌కు సమాచారం పంపినట్లు తెలిసింది. నిజానికి, ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ అజిత్  సింగ్‌ తనయుడు జయంత చౌదరి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సంప్రదింపులు జరుపుతున్నారు.

jayant chaudhary కోసం చిత్ర ఫలితం

దాంతో ఆర్‌ఎల్‌డీకి 25 సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ ముందుకొచ్చింది. కానీ, తమకు 50 సీట్లకు తక్కువైతే ఒప్పుకొనేది లేదని జయంత్ తెగేసి చెప్పారు. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. అయితే, తమకు సీట్ల సంఖ్యపై పెద్దగా పట్టింపు లేదని, తాము కోరిన సీట్లు ఇస్తే చాలని మొదటి నుంచీ చెబుతున్నామని, అఖిలేశ్‌ తాను మరోసారి ముఖ్యమంత్రి అయిపోయినట్లే భ్రమిస్తున్నారని, అందుకే తమ పార్టీ పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆర్‌ఎల్‌డీ అధికార ప్రతినిధి అనిల్‌ దూబే విమర్శించారు. బిహార్‌లో కూడా మహా కూటమికి మొదట యత్నించిన ఎస్పీ చివరికి భంగపాటుకు గురైన విషయాన్ని గుర్తు చేశారు.

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: