తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించడం బీజేపీ కి అతిపెద్ద లక్ష్యం దీన్ని సాధించడం కోసం వారు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అధికార టీడీపీ తో పొత్తు కారణంగా బీజేపీ ఏపీ లో కాస్తంత స్ట్రాంగ్ గానే ఉంది. అక్కడ అధికార పార్టీ తో పొత్తే దీనికి ముఖ్య కారణం. టీడీపీ నేతలకు మంత్రి పదవులిచ్చిన బీజేపీ... ఏపీ కేబినెట్ లో తన పార్టీ ఎమ్మెల్యేలిద్దరికీ మంత్రి పదవులను తీసుకుంది. ఈ క్రమంలో అంతగా సత్ఫలితాలు చూపలేకపోతున్న తెలంగాణపై ప్రస్తుతం ఆ పార్టీ దృష్టి సారించింది.  జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా తెలంగాణా కి విచ్చేసి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో పాలు పంచుకుంటున్నారు. తెలంగాణా ని ఇవాళ కాకపోతే రేపు తమ ఆధీనం లో కి ఎలా తెచ్చుకోవాలి అనేది వారి అంతర్గత ప్లాన్. తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి పక్కా వ్యూహ రచనతోనే ఆయన ఇక్కడికి వస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక పక్క పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు రాష్ట్రం లో పార్టీ బలోపేతం చెయ్యడం కోసం నిత్యం యాక్టివ్ గా ఉంటూ కష్టపడుతున్నారు. నిత్యం జనం లో ఉండే ఆయన కెసిఆర్ సర్కారు మీద గుడ్డిగా కాకుండా వ్యూహాత్మకంగా విమర్శలు చేసుకుంటూ వెళుతున్నారు. గతం లో కేవలం ఒక్క రోజు మాత్రమే తన పర్యటన లో భాగంగా హైదరాబాద్ లో ఉన్న అమీత్ షా ని కలవడం కోసం పార్టీ శ్రేణులు అన్నీ ఒక్క చోట కలిసాయి. ఈసారి ఆయన రెండు రోజుల పర్యటన చేస్తున్నారు. అంతేకాకుండా... పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆద్యంతం ఆయన పర్యవేక్షణలోనే కొనసాగనున్నట్లు సమాచారం. ఈ దఫా సమావేశాలకి రాష్ట్ర వర్గం మాత్రమే కాకుండా అమిత్ షా ప్రాధాన్యo గా వస్తూ ఉండడం తో బీజేపీ శ్రేణులలో పెద్ద ప్లాన్ లే బయటపడే అవకాశం కనిపిస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: