ఏపీ ప్రతిపక్ష నేత - వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిర్ణయాన్ని మొత్తం మీద ఓకే చేసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి లో మొత్తం మీద ఇల్లు కొనడానికి ఆయన సిద్ద పడ్డారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్ళిన సందర్భంగా ఆయన చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆయన అమరావతి లో అద్దె ఇంట్లో ఉంటున్నారు అనీ తాను ఏకంగా ఇల్లు కొనుక్కుని ఇక్కడ ఉంటాను అని వాగ్ధానం చేసారు . రాజధాని నిర్మాణం - రైతుల భూముల సేకరణ లాంటి విషయాల గురించి జగన్ మాట్లాడారు . రాజధాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొట్టిన మాదిరిగా చంద్రబాబు ప్రవర్తన ఉంది అని జగన్ మండి పడ్డారు. రైతులకి రాజధాని వలన ఏదైనా సాధ్యమైన ఆదాయం వచ్చేలా చెయ్యాలి కానీ ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయం అంటూ ఫైర్ అయ్యారు జగన్.రైతులకు ఇచ్చే వాణిజ్య స్థలాల్లో మాల్స్ పెట్టకూడదని ఆంక్షలు విధించారని అదే సమయంలో చంద్రబాబుకు భూములు ఇచ్చిన వారు మాత్రం 22 అంతస్థులు కట్టుకుని మాల్స్ పెట్టేందుకు అనుమతి ఇస్తున్నారని చెప్పారు. రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనేందుకు ఇదే నిదర్శనమని జగన్ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: