సాధారణంగా ఫ్యాన్సీ నెంబర్ అంటే ఎవరికైనా మంచి క్రేజ్ ఉంటుంది.  ముఖ్యంగా అన్నీ ఒకే నెంబర్లు వచ్చే ఫ్యాన్సీ నెంబర్ అంటే కూసింత ఎక్కువే పిచ్చి.  ఇలాంటి నెంబర్ కోసం టెండర్లు పాడి మరీ తమకు ఇష్టమైన నెంబర్ దక్కించుకుంటారు.  తాజాగా వాహనానికి ఫ్యాన్సీ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ అనుచరులు వీరంగం చేశారు.  ఫ్యాన్సీ నెంబర్ల టెండర్లలో అవతలి నుంచి ఒకే ఒక వ్యక్తి పోటీకి నిలవడంతో ఆయన, ఆయన అనుచరులు ఆ వ్యక్తిని పోటీ నుంచి తప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.  

తనలాంటి వీఐపీలకే ఇలాంటి నెంబర్స్ అవసరం కానీ, లేబర్ వాడికి ఎందుకు అంటూ ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు బాధితుడు తెలిపారు.   ఉయ్యూరు ఆర్టీవో కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ 16డీడీ 7777 నెంబర్ కోసం ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. ఒకరు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరుడు ప్రవీణ్‌కుమార్ కగా, మరోవ్యక్తి పేరు వినయ్‌కుమార్.

ఫ్యాన్సీ నెంబర్ తమకే దక్కాలంటూ ఎమ్మెల్సీ అనుచరులు రెచ్చిపోయారు. ఈ తతంగాన్ని రవివర్మ అనే వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించడానికి యత్నించాడు. అనుచరులు ఫోన్ కలుపగా ఫోన్లోనే ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, రవివర్మను దుర్భాషలాడినట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: