ఆంధ్రాలో కాపు ఉద్యమం మరోసారి రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపు సమస్యలపై  పోరాడేందుకు కాపు సంఘాలు సిద్ధమవుతున్నాయి. సర్కారుపై సమర భేరి మోగించేందుకు ఉద్యుక్తులవుతున్నాయి. దీనికోసం కాపు సంఘాలన్నీ ఏకమై కార్యాచరణపై చర్చించుకున్నాయి. 



కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 25న సత్యగ్రహాం చేపట్టాలని చివరకు డిసైడయ్యాయి. ఈ విషయాలను కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసిరెడ్డి జేసుదాసు గుంటూరు లో ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ముద్రగడ దీక్షా సమయంలో ఇచ్చిని హామీలు.. నెలలు గడుస్తున్నా పట్టించుకోవటంలేదని ఆరోపించారు.



అన్ని కులాల వారి విషయంలో న్యాయం చేస్తూ, కాపు నాయకుల విషయంలో మాత్రం కాలయాపన చేస్తున్నారని కాపు నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికీ పలు మార్లు నిరసనలు చేసినా.. ఎందుకు స్పందించటం లేదన్నారు. కాపు నాయకులకూ వైసీపీతో సంబంధాలను అంటగట్టడాన్ని వారు తప్పుబడుతున్నారు. 



వైసీపీ నాయకులతో కలిసి తాము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పటం అవాస్తవమని జేసుదాసు చెప్పుకొచ్చారు. ఓ వైపు కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ కాపు జేఏసీ కార్యక్రమాలు అందుకు ఊతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ కాపు నేతల ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో..!



మరింత సమాచారం తెలుసుకోండి: