ఈ మద్య జీవితంపై విరక్తి చెంది చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు స్పందించి మనసు వికలం చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  కొంత మంది ఆత్మహత్య సోషల్ మీడియాలో చూసి మరీ చేసుకోవడం మరీ విడ్డూరం.  ఆత్మహత్యలు ఎక్కువ శాతం యువతనే చేసుకుంటున్నారు..ప్రేమలో విఫలం చెందడం..అనుకున్న గోల్ రీచ్ కాకపోవడం..కొన్ని కాలేజీల్లో ర్యాగింగ్ కారణంగా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో బంగారు భవిష్యత్తు గల ఎదరొ ఈ లోకం వీడుతున్నారు.    ఏది ఏమైనా ఇలాంటి ఆత్మహత్యల వల్ల కన్నవారిని కన్నీటి పర్యంతం చేయడమే అవుతుంది.  

తాజాగా శోభా (30)   సాఫ్ట్ వేర్ ఇంజనీరు  వైట్ ఫీల్డ్ లో ఆఫీస్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.  మండ్యకు చెందిన శోభా చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కష్టపడి విద్యాభ్యాసం చేసింది. తరువాత సాఫ్ట్ వేర్ ఇంజనీరు అయిన శోభా తల్లితో కలిసి బెంగళూరులోనే నివాసం ఉంటున్నది.  శోభ గత కొంత కాలంగా మానసికంగా ఆవేదన చెందుతున్నట్లు సహ ఉద్యోగులు చెబుతున్నారు.  పోలీసులు చేపట్టిన విచారణలో..మండ్యలో శోభా తండ్రి పేరు మీద ఆస్తులు ఉన్నాయి.

తండ్రి మరణించిన తరువాత ఇప్పటి వరకు శోభా కుటుంబ సభ్యులకు ఆ ఆస్తులు ఇవ్వలేదు. ఆస్తుల పంపకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి బంధువులతో శోభాకు వివాదం ఉందని, కోర్టులో కేసులు విచారణలో ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు.  ఈ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమేమైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: