ఇది ద్రవిడ సంస్కృతిపై దాడి :

Image result for jallikattu

తమిళనాడు లో ఇప్పుడు ఎక్కడ చూసినా జల్లికట్టుకు సంబంధించిన టాపిక్ నడుస్తుంది.  అనాధిగా వస్తున్న సంస్కృతిపై దాడి చేస్తున్నారని అక్కడ ప్రజానికం ఆరోపిస్తున్నారు.  జల్లికట్టు కేవలం సాంప్రదాయమైన ఆట మాత్రమే అని జంతువులను హింసే క్రీడ కాదని అంటున్నారు.  సినీ-రాజకీయాలకు అతీతంగా జల్లికట్టుపై తమిళ జనమంతా ఒక్క తాటిపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెహమాన్, రజనీ, ప్రభుదేవా, వంటి ప్రముఖులు మెరీనా బీచ్ వేదికగా జల్లికట్టుకు మద్దతుగా నిలబడటంతో.. వేలాది జనం అక్కడికి తరలివచ్చి జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలన్న తమ ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. తమిళనాడు ప్రజలకు తెలుగు హీరోలు సైతం మద్దు పలుకుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాన్, మహేష్ బాబు తమ మద్దతు పలకగా వీరి బాటలోనే మరికొంత మంది నడుస్తున్నారు.


ఈ విజయదశమికి తెలంగాణ సినిమా అవార్డులు :

Image result for talasani srinivas

 దసరా రోజున తెలంగాణ ప్రభుత్వం తరఫున సినిమా అవార్డులు ఇస్తామని సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రకటించారు.  తెలుగు చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.  చిన్న చిత్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మంత్రి తలసానితో ఇండిహుడ్ ఫిల్మ్ కార్నివాల్ సభ్యులు సమావేశమయ్యారు. డిసెంబర్ 1నుంచి 4వరకు జరిగే కార్నివాల్ గురించి చర్చించారు.


తెలంగాణపై కన్నేసిన అమిత్ షా :

తెలంగాణలో అమిత్ షా: స్నేహమా.. రణమా..?

తెలుగు రాష్ట్రాల్లో తమకంటూ గ్రౌండ్ లెవల్ నుంచీ కార్యకర్తలను డెవలప్ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ ఎప్పటినుంచో భావిస్తున్న సంగతి తెలిసిందే.   ఎందుకంటే కేంద్రంలో టీడీపీ నేతలకు మంత్రి పదవులిచ్చిన బీజేపీ… ఏపీ కేబినెట్ లో తన పార్టీ ఎమ్మెల్యేలిద్దరికీ మంత్రి పదవులను తీసుకుంది. ఈ క్రమంలో అంతగా సత్ఫలితాలు చూపలేకపోతున్న తెలంగాణపై ప్రస్తుతం ఆ పార్టీ దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా  తెలంగాణకు వస్తున్న విషయం తెలిసిందే.  బీజేపీ తో తెరాస దోస్తీ అనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. తెరాస ఎంపీ కవితకు కేంద్రంలో మంత్రిపదవి దక్కే అవకాశం ఉందనే వార్తలు గతంలో వచ్చాయి కూడా! ఇదే క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వంపై కాంగ్రెస్, టీడీపీ పోరాటం చేసిన స్థాయిలో బీజేపీ చేసిన దాఖలాలు కూడా తక్కువనే అనుకోవాలి! ఈ క్రమంలో అమిత్ షా వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. 

2019 మాదే అధికారం : ఉత్తమ్ 

Uttam kumar fires at Centre and state government

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి దుర్భరం అయ్యింది.  ముఖ్యంగా ఏపీలో అయితే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మట్టికొట్టుకు పోయిందనడంలో ఆశ్చర్యం లేదు.  తెలంగాణలో కొద్ద మంది నాయకులతో ప్రతి పక్ష హొదాలో కాంగ్రెస్ కొనసాగుతుంది. దీంతో పార్టీని  గ్రామ గ్రామన పార్టీని బలోపేతం చేయాలి. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటాం' అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: