నిరాశా నిస్పృహలు మనిషిని ఏమైనా మాట్లాడిస్తాయి. ఆత్మబలం లేదా కాంఫిడెన్స్ లేనివాళ్ళ మాటలు ఎదుటివాళ్ళలో నిరుత్సాహాన్ని నిద్ర లేపుతాయి. మనదేశ సంస్కృతి ఆచారాల్లో పెరిగిన వాళ్ళు అమెరికా సమాజాన్ని అర్ధం చేసుకోకపోతే వచ్చే చిక్కులే ఇవి. అక్కడ శ్రామిక శక్తికి గౌరవం ఉంది దీన్నే మన "డిగ్నిటి ఆఫ్ లేబర్" అంటాం. శ్రమని గౌరవిస్తారక్కడ. ఏపనైనా పనే. దొంగ తనం లంజ తనం కాకుంటే చాలు. విశ్వమంతా ఇదే సిద్ధాంతం మీద నడుస్తుంది. ఇక అసలు కథ లోకి వద్ధాం:


Value of Dignity of Labour in US socity కోసం చిత్ర ఫలితం

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత అనేక మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో అనేక అనుమానా లు తలెత్తుతున్నాయి. రేపటి రోజున అమెరికాలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక ఆందోళన చెందుతు న్నారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పట్టుబడుతున్న ట్రంప్ ఈ నెల 20 న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఆయా రంగాలు మరీ ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటా యన్న అంశంపైనే ఇప్పుడు అందరి మధ్య చర్చ సాగు తోంది.


Value of Dignity of Labour in US socity కోసం చిత్ర ఫలితం

నిజానికి అమెరికా ఎన్నికల ఘట్టం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ కొత్త ఉద్యోగాల నియామకాల్లో కొంత స్తబ్ధత వచ్చేసింది. అనేక కంపెనీలు నియామకాలను నిలిపివేశారు. అనూహ్య పరిస్థితుల్లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సాఫ్ట్ వేరు నిపుణుల్లో మరీ ముఖ్యంగా భారతీయ విద్యార్థుల్లో ఆందోళన ఎక్కు వైంది. ట్రంప్ హయాంలో ఇమిగ్రేషన్ విధానం ఎలా ఉంటుంది? కేవలం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తారా? ఒకవేళ నిజంగానే అమెరికా స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తే, ఆ దేశ పరిస్థితి ఎలా ఉంటుంది? సాఫ్ట్ వేర్ రంగం పై ఆ ప్రభావం ఎలా ఉంటుంది? వంటి అనేక అంశాలపై తీవ్రాతి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలకు సైతం పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నాయి.



ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల మధ్య తానొక విసుగు చెందిన యూఎస్ విద్యార్థినిని అంటూ ఒకమ్మాయి వీడియో పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమెరికాలో భారతీయ విద్యార్థుల పరిస్థితులను వివ రిస్తూ ఆ అమ్మాయి చెప్పిన విషయాలపై రకరకాల భాష్యాలు వినిపిస్తున్నాయి. తాను బీటెక్ చేసిన ఏడాది తర్వాత అందరూ వెళుతున్నారు కదా! అబ్బా! అనుకుని అమెరికా వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ అమ్మాయి తన వీడియో పేర్కొన్నారు.


Disaapointments in american jobs for indians కోసం చిత్ర ఫలితం

ఆ వీడియోలో ఆ అమ్మాయి చెప్పిన యూనివర్సిటీల గురించి ఇంతకుముందే పలు వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ. గతేడాది ఆ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన వందలాది భారతీయ విద్యార్థులను విమానాశ్రయాల్లోనే ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేసి వెనక్కి పంపిన విషయం గుర్తుండి ఉండే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చెబుతు న్న యూనివర్సిటీలు కూడా అవే. ఆ యూనివర్సిటీల్లో చేరుతున్న అనేకమంది విద్యార్థులు పరిమితికి మించి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తుండటం, ఉద్యోగాలు చేయడం కోసమే వర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారన్న అనుమానాలతో అప్పట్లో అనేకమంది విద్యార్థులను ఎయిర్ పోర్టుల నుంచి వెనక్కి పంపించారు.


సంబంధిత చిత్రం

ఆ వీడియోలో అమ్మాయి చెబుతున్నదాన్ని బట్టి అక్కడ అనేక మంది పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారన్న సంగతి వెల్లడవుతోంది. అక్కడ ఇంటి రెంట్లు కట్టుకోలేక ఒకే ఇంట్లో 10 నుంచి 15 మంది విద్యార్థులు సర్దుకోవడం, వాళ్లలో కొందరు పాకీ పనులకు సైతం వెళుతున్నారని... ఇలా అనేక విషయాలను ఆ అమ్మాయి వెళ్లడించారు. అయితే అందరి పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఇండియాలోనే హాయిగా ఉండాలని చెబుతున్న ఆ అమ్మాయి అభిప్రాయాలను విబేధిస్తున్న వారూ ఉన్నారు.


american universities cheating indian students కోసం చిత్ర ఫలితం

సమర్థిస్తున్న వాళ్లూ ఉన్నారు. అమెరికాలో అంతగా ఇబ్బందులు ఉంటే.. ఇక అక్కడెందుకు ఉండాలి? తిరిగి వచ్చేయొచ్చు కదా... అని ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. అమెరికా వెళ్లడమంటే కష్టాలు తప్పవు మరి అని చెబుతున్న వాళ్లూ ఉన్నారు. ఏదేమైనా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వం ప్రకటించే ఇమిగ్రేషన్ విధానంపైనే ఇప్పడు అందరి దృష్టి ఉంది. ఏదేమైనప్పటికీ డాలర్ మోజు తీరాలంటే  కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు... తప్పవు.


american universities cheating indian students కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: