సుప్రీం కోర్టు వాస్తవానికి తమిళనాడులో జల్లికట్టును 2014 లోనే నిషేధించింది. అప్పటి నుంచి అప్పీళ్ల మీద అప్పీళ్లు కొనసాగుతున్నాయి. 2015లో ఓ అప్పీల్‌పై నిషేధం సక్రమమేనంటూ తీర్పు చెప్పింది. మొన్న నవంబర్‌లో ఇది ‘ఇది గ్లాడియేటర్‌’ తరహా ఆటవిక క్రీడా అని కూడా వ్యాఖ్యానించింది. నిషేధం ఎత్తివేస్తూ తీర్పు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టుపై ఒత్తిడి పెరిగింది. పొంగల్‌ లోపల తీర్పు ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈసారి ఎలాగైనా జల్లికట్టు జరిగేలా చూస్తానంటూ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వడమే కాకుండా జల్లికట్టును అనుమతిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకరావాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు.



ఈ హింసను కూడా సహించలేమని భారత జాతీయ జంతువుల సంక్షేమ బోర్డు, పెటా లాంటి సంస్థలు వాదిస్తున్నాయి. సంతానం కలిగే అవకాశం లేకుండా ఎద్దులు, కుక్కల వరి బీజాలను నాటు పద్ధతిలో నలిపేయడాన్ని ఈ సంస్థలు ఎందుకు సమర్థిస్తున్నాయి. అది జంతువులను హింసించడం కిందకు రాదా? క్షీర విప్లవం పేరిట, డెయిరీల అభివద్ధి పేరిట ఆవులను, బర్రెలను పాలించే యంత్రాలుగా మార్చడం జీవ హింస కాదా? పాలను పీల్చే యంత్రాలు వాటి రక్తాన్ని పీల్చిన సందర్భాలు లేవా? జల్లికట్టును సమర్థిస్తున్నవారు, అటు వ్యతిరేకిస్తున్న వారు సగం సత్యమే మాట్లాడుతున్నారు.\



తమిళనాడులో ముఖ్యంగా కావేరి డెల్టా ప్రాంతంలో 140 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఏర్పడిన తీవ్ర కరవు పరిస్థితులను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది ఈశాన్య, నైరుతి రుతుపవనాలు విఫలమవడంతో వ్యవసాయం సాగు భారీగా పడిపోయింది. పర్యవసానంగా ఇప్పటికే 144 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, కూలి దొరక్కా వ్యవసాయ కూలీలు పస్తులుంటున్నారు. మైక్రోఫైనాన్సర్ల కబంధ హస్తాలో ఇరుక్కుంటున్నారు. మంచి, చెడు విచక్షణ లేకుండా సంప్రదాయాల కోసం సమైక్యమయ్యే ప్రజలు నిజమైన సమస్యలపై ఎప్పుడు తిరగబడతారో!

మరింత సమాచారం తెలుసుకోండి: