తమిళనాడులో జల్లి కట్టు ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతోంది. జంతువులను హింసించడం అనే కాన్సెప్టు కింద జల్లికట్టును నిషేధించారు. దీనిపై నిషేధాన్ని ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు. అంటే నిబంధనల ప్రకారం జల్లికట్టు విరుద్దమే అన్నమాట. ఐనా.. తమిళనాడు అంతా ఏకమైంది. కేంద్రాన్ని కదిలిస్తోంది. 

Image result for jallikattu movement
చివరకు తమిళ ఉద్యమానికి కేంద్రం దిగిరాక తప్పడం లేదు. తమిళనాడు తయారు చేసి పంపిన ఆర్డినెన్సును అమల్లోకి తెచ్చేందుకు పచ్చజెండా ఊపేసింది. ఇక రాష్ట్రపతి ఆమోదించడమే తరువాయి.. జల్లికట్టుపై నిషేధం ఎత్తేస్తారు. తమిళనాడులో జల్లికట్టు యథాప్రకారం జరుగుతోంది. ఈ ఘటనతో తమిళుల శక్తి మరోసారి అందరికీ తెలిసొచ్చింది.
Image result for jallikattu movement


ఇక్కడ తమిళుల శక్తితో పాటు ఆంధ్రానాయకుల చేతగానితనం కూడా గుర్తుకురాక మానదు. ఎందుకంటే.. ఏపీ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తూ అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభకు వచ్చి మరీ హామీ ఇచ్చారు. ఇప్పటి కేంద్రమంత్రి.. తెలుగు నాయకుడు వెంకయ్యనాయుడు ఐదేళ్లు కాదు.. పదేళ్లు అంటూ నినాదాలు చేశారు. 



ఇప్పటి ప్రధానమంత్రి తిరుపతి హోదా ఇస్తామని తిరుపతి వెంకన్నసాక్షిగా బాస చేశారు. మరి చట్టవిరుద్దమైన దాన్ని కూడా కలసికట్టుగా తమిళులు ధించుకో గలుగుతున్నప్పుడు.. ఇచ్చిన హామీని కూడా ఆంధ్రానేతలు ఎందుకు సాధించుకోలేకపోయారు. అందులోనూ టీడీపీ కేంద్రం సర్కారులో భాగస్వామి కూడా. ప్రత్యేక హోదా ఎవరికి రాజకీయ లబ్ది చేకూరుతుందనే లెక్కలు వేసుకోవడం మాని పార్టీలకు అతీతంగా హోదా ఉద్యమం చేపడితే ఢిల్లీని కదిలించలేరా..!



మరింత సమాచారం తెలుసుకోండి: