zaira wasim & vijay goyal కోసం చిత్ర ఫలితం


బురఖా వేసుకున్న వాళ్ళకు అందం, స్వాతంత్రం, సామర్ధ్యం కూడా ఉంటాయని ఆ బాల నటి అద్భుతంగా చెప్పింది. కాశ్మీర్‌కు చెందిన ఈ బాలనటి పేరు జైరా వసీం. దంగల్ చిత్రంలో గీతా పోగట్ చిన్ననాటి పాత్రలో నటించి మెప్పించింది. కానీ ఈ బాలనటి చుట్టూ వివాదాలు కమ్ముకుంటూనే ఉన్నాయి. రోజు రోజుకి వివాదాలు మాత్రం పెరుగు తూనే వస్తున్నాయి. 


zaira wasim & vijay goyal కోసం చిత్ర ఫలితం

ప్రస్తుత వివాదం కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ - ఆమెపై మరో వివాద వ్యాఖ్యను చేశారు. ఓ గ్యాలరీలోని నగ్న చిత్రాన్ని జైరా వసీంకు అన్వయించారు."ఈ ఫోటో జైరా వసీం పరిస్థితికి అద్దంపట్టేలా ఉందంటూ! పంజరంలో బందీ అయి ఉన్న ముస్లిం యువతి చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి జైరా వసీం పరిస్థితి ఇలాగే ఉందంటూ" కామెంట్ చేసారు. 


zaira wasim & vijay goyal కోసం చిత్ర ఫలితం

డీనిపై జైరావసీం తనదైన శైలిలో అద్భుతంగా పరిపక్వతతో స్పందించింది.  క్రీడలమంత్రి మాటలకు జైరావసీం కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. "సార్ మీరు వర్ణించిట్లు ఈ బొమ్మతో నేనెలా కనెక్ట్ అవుతాను ? మీరు చెబుతున్నట్లుగా ఈబొమ్మకు నాకు ఎలాంటి సారూప్యత లేదు. నేను మీకో విషయం తెలియచేయాలనుకుంటున్నా! బురఖా వేసుకునేవాళ్ళు అందంగానే కాదు, స్వేచ్ఛగా కూడా ఉంటారు ” అంటూ మంత్రికి ఘాటుగానే జైరా సమాధానం ఇచ్చింది. 


సంబంధిత చిత్రం


వెంటనే స్పందించిన మంత్రి తన ఉద్దేశాన్ని నీవు తప్పుగా అర్థం చేసుకున్నావని బదులిచ్చాడు. చిన్న వయసులోనే నువ్వు ఎంతో సాధించావు. నీలాగే బాలికలందరు కట్టుబాట్లను, నిబంధనలను దాటుకుని ఎదగాలని కోరుకుంటున్నట్లు మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. తనను తాను సవరించుకున్నారు. 


సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: