ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్‌ విస్మరించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.  తమ్మినేని చేపట్టిన యాత్ర జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ.. రైతులు పంటలకు గిట్టుబాటు ధరలేక నానా తంటాలు పడుతుంటే సర్కారు చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే ఓపెన్ కాస్టు విధానం రద్దు చేస్తామని ప్రకటించి, తిరిగి బొందల గడ్డలుగా మార్చడానికి శ్రీకారం చుట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.


హామీలను విస్మరించిన కేసీఆర్‌

 బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి రెండున్నర ఏళ్లు గడచినా ఆచరణలోకి రాలేదన్నారు. తండాలను పంచాయతీలుగా మారుస్తామని, నిరుపేద హరిజనులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామని నెరవేర్చలేకపోయారని విమర్శించారు. దీనికి హరీష్ రావు కౌంటర్ ఇస్తూ..‘‘సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పచ్చి అబద్ధాలు మాట్లాడుతు న్నారు. ఆయన వ్యాఖ్యలు అసెంబ్లీని, శాసన సభ్యులను అవమానపరిచేలా ఉన్నాయి. మొదట్నుంచీ తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎం ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని జీర్ణిం చుకోలేకపోతోంది.


తమ్మినేని పచ్చి అబద్ధాలకోరు

ఆ పార్టీకి ఏ ఎజెండా లేదు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పేదల ఎజెండా మింగుడు పడడం లేదు’’ అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు అంశంపై పార్లమెంటులో కాంగ్రెస్, సీపీఎం మాట్లాడలేదని, కానీ తెలంగాణ అసెంబ్లీలో వారి సభ్యులు మాట్లాడలేదా అని ప్రశ్నించారు. పేదలు పేదలుగానే ఉండిపో వాలన్నది సీపీఎం విధానమా అని నిలదీశా రు. పాదయాత్రను పార్టీ ఫుల్‌టైమ ర్లతో సాగిస్తున్నారని, వారి వెనుక కార్యకర్తలే లేర న్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే భవిష్య త్‌లో ఆ పార్టీకి కార్యకర్తలే మిగలరన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: