రాజకీయ నాయాకుడు అనే బోర్డు తగిలించుకున్న ఏ ఒక్కరూ మాటలకీ చేతలకీ సంబంధం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు అది చాలా మామూలు విషయం అందరికీ తెలిసిందే కూడా .. వారు మాట్లాడే ప్రతీ మాట వెనకా ఒక పెద్ద రాజకీయ అజెండా ఉంటుంది అది లేకపోతే వారు మాట్లాడనే  లేరు . ఒక విషయం మీద టార్గెట్ పెట్టుకుని మరొక విషయాన్నికోట్ చేస్తూ దాన్ని హై లైట్ చేస్తూ మాట్లాడ్డం వారికి అలవాటే. యువరాజ్యం అధినేత గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి అందరం చూసాం. ఇప్పుడు మాత్రం ఫక్తు పొలిటీషియన్ లా మారిపోయాడు ఆయన. జల్లి కట్టు గురించి పవన్ తాజాగా చేసిన వ్యాఖలలో అది స్పష్టం అవుతోంది. ఎలెక్షన్ టైం లో జాతీయ స్ఫూర్తి అంటూ తెలంగాణా ఉద్యమం గురించి గొప్పగా మాట్లాడిన కళ్యాణ్ తెలుగు వారి మధ్యన విభేదాలు వద్దూ వద్దూ అంటూ పదే పదే చెప్పేవాడు. ఆ మాటలకి కళ్యాణ్ ని కచ్చితంగా అభినందించాలి. కానీ పవన్ ఇప్పుడు జల్లికట్టు ని అడ్డం పెట్టుకుని జాతీయ సమైక్యత కి భంగం కలిగించేలా మాట్లాడుతున్నాడు అనే వాదన వినిపిస్తోంది. దశాబ్ధాల క్రితం ద్రావిడ సంస్కృతి అన్న మాటను పట్టుకుని ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మధ్య విభజన రాజకీయాలు చేశారు తమిళ నాయకులు. ఆ నినాదాలను ఆధారంగా చేసుకుని సౌత్ ఇండియన్స్‌కి, తమిళ ప్రజలకు ఏం ఒరగబెట్టారో తెలియదు కానీ చాలా మంది నాయకులయ్యారు. ఆ ఒక్క కారణాన్నీ అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రులు అయినవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వారు సృష్టించిన విభేదాలు తమిళ ప్రజలతో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా ఒకరకమైన ఇబ్బందులు గురి చేసాయి. వారిలో వారికి లేనిపోని వివాదాలు దర్సనం ఇచ్చాయి. ప్రాంతీయ ప్రయోజనాల కోసం పాటు పడ్డం అసలు తప్పేమీ కాదు కానీ జనాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ విభేదాలు సృష్టించడం స్వార్థ రాజకీయమే అవుతుంది. జల్లికట్టుపై నిషేదం నేపథ్యంలో అసలే తమిళ నాడు రణరంగమై ఉన్న నేపథ్యంలో పవన్‌లాంటి ఆలోచనాపరులు కూడా ద్రావిడ సంస్కృతిపై దాడి అంటూ మాట్లాడడం మాత్రం భావ్యం కాదు. మోడీ తో సహచర్యం ఉన్న కళ్యాణ్ మోడీ కి మిత్రుడిగా మాట్లాడి చంద్రబాబు ద్వారా అవసరం అయితే వివాదాన్ని పరిష్కరించాలి కానీ ఇలా జాతీయ సమైఖ్యత గురించి గొప్పగా మాట్లాడిన వ్యక్తి ద్రావిడ సంస్కృతి మీద దాడి అంటూ ఉత్తర - దక్షిణ భారతావని ల మధ్యన విభేదాలు పెంచేలా మాట్లాడ్డం సరైన పద్ధతి కాదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: