ఐకమత్యం అంటే ఏంటి అనేది తమిళ ప్రజలు ఓపెన్ గా చూపించారు. ఒక దశ లో సాధ్యం కాదు అనుకున్న జల్లి కట్టు ని సాధ్యం చేసి చూపించారు. ఔరా అనిపిస్తూ దేశం మొత్తానికీ పెద్ద ఎత్తున గట్టి నినాదాలు ఇచ్చారు తమిళ ప్రజలు. గంటలేంటి రోజుల పాటు మెరీనా బీచ్ లో అంతా గుమిగూడి ఒక్క పొలిటికల్ జెండా ని కూడా లోపలి రానివ్వకుండా ముఖ్యమంత్రి నీ , ప్రతిపక్షాన్నీ సైతం బయటకి నెట్టేసి ప్రజా ఉద్యమం అంటే ఏంటో చూపించారు వాళ్ళు. ఈ ఉద్యమాన్ని మన తెలుగు హీరోలు కూడా సపోర్ట్ చేసారు , తెలుగు జనం కూడా సపోర్ట్ అందించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం తనదైన శైలి లో వారికి ప్రసంసలు అందించి జల్లికట్టు మీద నిషేధం ఎత్తేయ్యండి అంటూ నినదించాడు. వారు మొత్తం మీద మూడే మూడు రోజుల్లో విజయం సాధించారు. ఒక్క దెబ్బతో డిల్లీ పీఠం కదిలేలా నిర్ణయం తీసుకునేలా చేసారు. ఇది ఏ ఒక్కరి గొప్పతనం కాదు యావత్ తమిళ లోకం గర్వించదగ్గ విషయం. తమిళనాడు లో ఈ జల్లికట్టుని స్పూర్తిగా తీసుకుని ఇప్పుడు ఏపీ లో కూడా స్పెషల్ స్టేటస్ కోసం ఉద్యమం మొదలైంది. నిజానికి ఇది అక్కడి లాగానే మొదట సోషల్ మీడియా లో స్టార్ట్ అవుతోంది. ఫేస్ బుక్ పేజీ ల ద్వారా ఈ ఉద్యమం మొదలైంది. నేమ్మదిగా ట్విట్టర్ లో పుంజుకుంటోంది. జనం వైజాగ్, విజయవాడ స్థానాలు గా ఏర్పరచుకుని లక్షలాది సంఖ్యలో వస్తే ఇది పెద్ద విషయమేమీ కాదు. కానీ ఆంధ్రా లో ఇప్పటివరకూ ఇలాంటి ఉద్యమం జరగనే లేదు. ప్రజలందరూ ఒక తాటి పైన నిలబడిన సందర్భాలు లేవు. జై ఆంధ్రా ఉద్యమం జరిగి ఎన్నో దశాబ్దాలు గడిచింది ఆ జేనేరేషన్ అప్పుడే ముగిసింది. తమిళ పోరాట స్ఫూర్తి ని మెచ్చుకుంటున్న మనవాళ్ళు అందరూ ఇప్పుడు ప్రత్యేక ఉద్యమం కోసం ఏ రకంగా కష్టపడతారు అనేది చూడాలి మరి. పవన్ కళ్యాణ్ ఈ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని అన్ని రాజకీయ పార్టీలనీ ఒకే తాటి మీద నడిపిస్తే బాగుంటుంది లేదా ప్రజలు స్వయంగా ఉద్యమం లేవదీస్తే రాజకీయ నాయకులకి ఛాన్స్ కూడా ఉండదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: