ఏపీ ప్రత్యేక హోదా అంశంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి స్పందించారు. హోదా అంశంపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జనవరి 26న విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఏపీ యువత మౌన నిరసన కార్యక్రమం చేపడితే జనసేన మద్దతు ఇస్తుందని పవన్‌ ప్రకటించారు.  దేశవ్యాప్తంగా జరుగుతున్న అవకాశవాద, విభజన, నేరపూరిత రాజకీయాలను నిరసిస్తూ ‘దేశ్‌ బచావో’ పేరుతో ఒక మ్యూజికల్‌ ఆల్బం ద్వారా జనసేన తన గళమెత్తుతుందని మరో ట్వీట్‌లో ఆయన తెలిపారు. ఈ ఆల్బమ్‌ను తాను ఫిబ్రవరి 5న విడుదల చేద్దామని తొలుత అనుకున్నానని.. కానీ, దాన్ని ముందుకు జరిపి జనవరి 24న (మంగళవారం) విడుదల చేయనున్నట్టు పవన్‌ ట్వీట్‌ చేశారు.



 టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన పోలవరం గుత్తేదారు కంపెనీ ట్రాన్ స్టాయ్ అడ్డగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డ్‌గా మార్చేస్తే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారన్న వివేకం కూడా చూపకపోతే ఎలా అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రైతుల సమస్యలపై పవన్ వరుస ట్వీట్లలో లేఖాస్త్రాలు సంధించారు.'ఈ భూముల రైతులు తమ వారు కాదనా.. లేక కాంట్రాక్టర్‌కు ఇబ్బందనా.. గత్యంతరం లేని రైతులు తగిన నష్ట పరిహారం చెల్లించమని అడిగితే వారి మొర ఎందుకు వినరు.


ఏపీ సర్కారుకు జనసేన పార్టీ డిమాండ్లు

పోవలరం రైతులు ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయారు. ఇది అన్యాయమని అడిగితే పోలీసులతో కేసులు పెట్టించి వారి నోరు మూయిస్తున్నారు. ఇది మంచిదికాదు. ఇకనయినా వారికి అన్యాయం చేయండి తాము దళితులం అయినందువల్లే నష్ట పరిహారం చెల్లింపులో వివక్షకు గురవుతున్నామని ఈ ప్రాంత రైతులు ఆవేదనతో ఉన్నారు. ఇది సమాజానికి మంచిది కాదు' అని పవన్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: