తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో చిరంజీవి తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్.   తెలుగులో హీరోగా మంచి స్థానం సంపాదించిన పవన్ కేవలం నటుడిగానే కాకుండా ప్రజా సేవ చేయాలనే యోచనతో సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ అనే పార్టీ స్థాపించారు.  ప్రశ్నించడానికి వస్తున్నా అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు.  ఇప్పటి వరకు జనసేన పార్టీ తరుపున ఎన్నో సామాజిక సేవలు చేస్తున్న పవన్ కళ్యాన్ ఆ మద్య తిరుపతిలో భారీ బహిరంగ సభ సందర్భంగా ప్రత్యేక హోదా గురించి గర్జించారు.   తర్వాత కాకినాడు, అనంతపురంలో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్రాలపై విరుచుకు పడ్డారు.
Image result for pawan kalyan meeting
తాజాగా మరోసారి పవన్ గర్జించారు..''తిడితే భరించాం , విడగొట్టి గెంటేస్తే సహించాం .... ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తిరగబడతాం ''  , గాంధీ ని ప్రేమిస్తాం , అంబేద్కర్ ను ఆరాధిస్తాం .... సర్దార్ పటేల్ కు సెల్యూట్ చేస్తాం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కానీ ..... తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పొతే చూస్తూ కూర్చోమ్  , మెడలు వంచి కింద కూర్చోబెడతామని హెచ్చరిస్తూ ట్వీట్ చేసాడు పవన్.  
Image result for pawan kalyan meeting
గత కొంత కాలంగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం రేపాయి.  సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ యూత్ ని మానసికంగా సిద్ధం చేస్తున్నాడు పవన్ . ఆంధ్రప్రదేశ్ నాయకులకు తెగువ , ఆత్మగౌరవం లేవని ఘాటుగా విమర్శించాడు . యువత స్పెషల్ స్టేటస్ కోసం పోరాడాలని పిలునిచ్చాడు పవన్ .

పవన్ ట్విట్ :


మరింత సమాచారం తెలుసుకోండి: