మనం సాధించాం..శాంతించండి : రజినీ


దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ జల్లికట్టు ఉద్యమం హింసాత్మకం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జల్లికట్టు ఉద్యమంతో చరిత్ర సృష్టించారని ఉద్యమకారులపై పొగడ్తలు కురిపించారు.తమిళనాడులో 'జల్లికట్టు' ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. నిన్నమొన్నటి వరకు శాంతియుత నిరసనలు, ఆందోళనలకే పరిమితం అయిన ఈ ఉద్యమం ప్రస్తుతం హింసాత్మకంగా మారుతోంది. ఆందోళన కారులు పలు చోట్ల విధ్వంస కాండకు పాల్పడుతున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, నిప్పుపెట్టడం లాంటివి చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ నటుడు రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.


 బడ్జెట్ వాయిదాపై సుప్రీమ్ ట్విస్ట్ :


కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ ను వాయిదావేయాలంటూ నమోదైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఎన్నికల అయిపోయేంత వరకు బడ్జెట్ ను వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బడ్జెట్‌ సమర్పణను వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.


తమిళనాడు అసెంబ్లీ నుంచి డిఎంకె, కాంగ్రెస్ వాకౌట్ :

tamil-nadu-assembly

ప్రస్తుతం తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. ఓ వైపు కేంద్రం జల్లికట్టు నిర్వహణకు ఓకే చెప్పినా..దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని అక్కడి ప్రజానికం కోరుకుంటున్నారు.  ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జల్లికట్టు ఆర్డినెన్స్ ను ఇవాళ సాయంత్రం 5 గంటలకు సభలో ప్రవేశ పెట్టే అవకాశముంది. గవర్నర్ విద్యాసాగర్ రావు…తన ప్రసంగంలో జల్లికట్టును ప్రస్తావించారు. అటు జల్లికట్టు ఆందోళనకారులపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ డీఎంకే, కాంగ్రెస్ లు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: