తమిళ తంబీలు అందరూ ఒకటై జల్లికట్టు ని చాలా తేలికగా సాధించుకున్నారు. వారి పనిని తేలిక చేసింది కేవలం వారి ఐక్యత తప్ప ఇంకేదీ కాదు. ఎక్కడ చూసినా ఇప్పుడు జల్లికట్టు ని టార్గెట్ చేసుకుని ఏపీ కి ప్రత్యేక హోదా తీసుకునిరావచ్చు కదా , వారి లాగానే మనం కూడా ఉద్యమం లేవదీయచ్చు కదా అనే మాటలే.


ప్రతిపక్షాలు సైతం జల్లికట్టు లాంటి ఉద్యమం ఆంధ్రా లో కూడా రావాలి అంటున్నారు. ఇదంతా జరిగే విషయం కాదులెండి అనేవారు కూడా కొందరున్నారు. ఎవరి లెక్కలు , ఎవరి విశ్లేషణలు వారివి గా సాగుతున్నాయి.ఈ రంగుల కళ్ళజోళ్ళు తీసి పార్టీల దృష్టి పకకి పెట్టి కాసేపు వాస్తవాలు లేక్కేసుకుంటే అక్కడి ఉద్యమానికీ మన ఉద్యమానికీ సంబంధం ఉందా అనేది చూద్దాం. ఆంధ్రులు ఆరంభశూరులు అనే మాట ఇప్పుడు నిజం కాబోతోందా ? అన్నిటికంటే మొదటి తేడా జల్లికట్టు అనేది తమిళనాడు లో ఒక సాంప్రదాయ క్రీడ.


ఎన్నో వేల సంవత్సరాలు గా వారికి అదొక ఆనవాయితీ. దాని మీద వారికి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. పైగా సంస్కృతీ సాంప్రదాయాలకి సంబందించిన విషయం ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న క్రీడ అది. మరి ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా విషయం లో మనకి అన్యాయం జరిగింది అనీ జరుగుతోంది అనీ మనోళ్ళు నిజంగా ఫీల్ అవుతున్నారా ? రెండూ పోల్చి చూడలేం అనేది విశ్లేషకుల వాదన. రెండవ తేడా ఏంటంటే జల్లికట్టు లాంటి సాంప్రదాయ క్రీడ కోసం ప్రాంతాలతో , వర్గాలతో బేధం లేకుండా అందరూ స్పందించారు.



కానీ కులపు గోడలనీ ప్రాంతాల గోడలనీ ఆంధ్రులు బద్దలు కొట్టగలరా అనేది పెద్ద ప్రశ్న. తెల్లారి లేచింది మొద‌లు కులగ‌జ్జిని నూరిపోసి న‌రాల్లోకి ఎక్కించేందుకు సందుకో నాయ‌కుడు ఉన్నాడు. ప్రతీ అంశంలోనూ కులగజ్జి కుళ్లు కంపు కొడుతోంది. త‌ప్పు ప్ర‌జ‌ల‌ది కాదు… య‌థారాజ త‌థా ప్ర‌జ‌! సో… జ‌ల్లిక‌ట్టుతో పోల్చి చూడ‌లేం.సోషల్ మీడియా నుంచి రోడ్ల మీద ఉద్యమం చెయ్యడం వరకూ జల్లి కట్టు కి తమిళ యువత యొక్క ప్రాధాన్యత గట్టిగా ఉంది. ఉద్యమించాలి అనుకోగానే చెన్నయి మెరీనా బీచ్ కే వెంటనే తరలి వచ్చారు అక్కడి యువత . క్రీడ అనగానే అక్కడవారు వెంటనే కనక్ట్ అయిపోయారు. చాలా మంది ప్రత్యేక హోదా ఎందుకు అవసరం ఉందా లేదా ? కనీసం వస్తే ఎందుకు దాంతో ఉపయోగం ఏంటి అనే అవగాహన కూడా లేనివారు ఉన్నారు.


త‌మిళ‌నాట జ‌రిగింది ఒక క్రీడ‌కు సంబంధించిన పోరాటం కాబ‌ట్టి.. యూత్ ఈజీగా క‌నెక్ట్ అయ్యారు. ప్ర‌త్యేక హోదా అలాంటి ఆట కానే కాదు. సినిమా పరిశ్రమ కూడా అక్కడ పాజిటివ్ గా స్పందించింది. ఇక్కడ ప్రముఖ హీరోలు నల్ల చొక్కాలు వేసుకుని మొఖానికి క్లాత్ కట్టుకుని బీచ్ కి వచ్చే పరిస్థితి ఉందా ? అభిమానుల్లో తమ సినిమా కలక్షన్ లని మాత్రమే లెక్క వేసుకునే వీరికి ప్రజల సమస్యలు పడతాయా అనేది క్యూస్షన్. ఒక సాంప్రదాయ ఆట కీ ఒక హక్కుగా ఫీల్ అయ్యే ప్రత్యేక హోదా కీ లింక్ పెట్టలేము. కానీ యువత గట్టిగా ఒక్కతాటి మీద నిలబడితే మాత్రం కచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వచ్చి తీరుతుంది. పైగా ఇలాంటి విషయాల్లో రిజల్ట్ కంటే కూడా ఎలాంటి విషయంలో అయినా తమ ఐక్యత చాటడం అందరికీ మంచి పరిణామం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: