సృష్టిలో కొన్ని అద్భుతాలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి అద్భుతాలు మనుషులను ఆశ్చర్యానికి గురి చేస్తాయనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ అద్భుతం మానవ శరీరానికి సంబంధించినది అయితే అది మరింత వింతే. సాధారణంగా మనుషుల శరీర నిర్మాణంలో కొన్ని వింతలు చోటుచేసుకుంటూ ఉంటాయి. అయితే మనుషుల్లో వారి చేతి వేళ్లకు సంబంధించి ఉన్న దానికంటే ఎక్కువ ఉండడం అరుదుగా చూస్తూ ఉన్నాం. కానీ చేతులు, కాళ్లు, పురుషాంగం కూడా ఉండవలిసిన దానికంటే అధికంగా ఉండడం మాత్రం ఎప్పుడూ చూసుండం. 



దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. ‘‘నాలుగు కాళ్లతో కనిపిస్తున్న ఈ మగ శిశువు కర్ణాటకలోని దంపతులకు జన్మించాడు. అసాధారణ జన్మ అయినా కాన్పు నార్మల్‌గానే అయిందట! శనివారం ఈ శిశువు భూమి మీదకు వచ్చాడు. కాళ్ళతో పాటు పురుషాంగాలు కూడా రెండున్నాయి. ఈ శిశువు తమకు దేవుడిచ్చిన బహుమతి అని ఆ బిడ్డ తల్లి లలితమ్మ చెబుతోంది.



ఆ శిశువును సాధారణ స్థితికి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలను తొలుత అడ్డుకున్నా.. వైద్యులు సర్దిచెప్పాక అంగీకరించింది. ప్రస్తుతం ఈ శిశువుకు బల్లారిలోని విజయనగర వైద్య కళాశాల(విమ్స్‌)లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: