తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు సేవచేయాలనే తలంపుతో సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ అనే పార్టీ స్థాపించారు.  ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల గురించి పోరాడిన పవన్ ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తున్నారు.  ఈ మేరకు తిరుపతి,కాకినాడ,అనంతపురంలో తన ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారు.   తాజాగా ఏపీ స్పెషల్ స్టేటస్ పై వరుస ట్విట్లు చేస్తున్నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ట్వీట్టర్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాడు. దేశీ బచావో పేరుతో క్రిమినల్ పొలిటికల్ పై మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశాడు.
Related image
 దేశం మాకు గాయాలిచ్చినా.. నీకు మేము పువ్వలిచ్చామంటూ రాశాడు. ఓటు అనే బోటుపై మా అందరికీ ఏమి తెస్తావు అంటూ ప్రశ్నించాడు. ఈ నెల 26న విశాఖ ఆర్కే బీచ్ లో నిరసన చేపట్టనున్న పవన్ కల్యాణ్.. ప్రత్యేక హోదా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఓ ఆల్బమ్ విడుదల చేస్తున్నారు. మొదట  ఫిబ్రవరిలో ఈ ఆల్బమ్ రిలీజ్ చేయాలనుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ విడుదల చేయనున్నారు. జనసేన యూట్యూబ్ ఛానల్ తో ఆల్బమ్ రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశారు. కాగా ఆర్కే బీచ్ లో నిరసనకు అనుమతివ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు.
rk-beach
సోషల్ మీడియా ఆధారంగా ఇచ్చే పిలుపులకు ఎలాంటి ఓనర్ షిప్ ఉండదని, ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరిదని డీజీపీ ప్రశ్నించారు. శాంతి భద్రతలే తమకు ముఖ్యమన్న డీజీపీ…సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్ లను చూసి గుమికూడవద్దని కోరారు. యువతకు ముందే చెపుతున్నామని, అక్కడకు వచ్చి కష్టాలు కొనితెచ్చుకోవద్దని చెప్పారు.
Image result for jallikattu marina beach
చెన్నై మెరీనా బీచ్ లో కూడా తొలుత శాంతియుతంగానే నిరసరన కార్యక్రమం జరిగిందని, తర్వాత హింస చెలరేగిందని డీజీపీ గుర్తు చేశారు.  దేశంలో అరాచకాలు సృష్టించడానికి కొంత మంది పనిగట్టుకొని ఇలాంటి సమయాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని నాయకత్వం లేని నిరసనలలో అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదం ఉందని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: