భారత దేశంలో గత కొంత కాలంగా తమిళనాడు రాష్ట్రం ప్రతి విషయంలో సంచలనాలకు నాంధి పలుకుతుంది.  ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి  జయలలిత  హాస్పిటల్ లో చేరిప్పటి నుంచి చనిపోయే వరకు ఆ తర్వాత ఆమె స్థానంలో ఎవరు వస్తారన్న విషయంపో సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా..తాజాగా జల్లికట్టు ఒక్క కుదుపు కుదిపేస్తుంది. ఇప్పుడు మరో సంచలన విషయం తెరపైకి వచ్చింది..అదే జ‌న‌వ‌రి 26వ తేదీ నుంచి పెప్సీ, కోకాకాలా లాంటి శీత‌ల పానియాలు నిషేధిస్తున్న‌ట్లు త‌మిళ‌నాడు థియేట‌ర్ య‌జ‌మానుల సంఘం అధ్య‌క్షుడు వెల్ల‌య‌న్ ప్ర‌క‌టించారు.
‘జల్లికట్టు’ ఎఫెక్టు.. థియేటర్లలో పెప్సీ, కోక్ పై బ్యాన్ !
జ‌ల్లిక‌ట్టును పెటా వ్య‌తిరేకించ‌డం, పెటాకు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా ఉన్న ప‌లువురు న‌టులు పెప్సీ కోకాకోలాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హరించ‌డంతో ఆ కూల్ డ్రింక్స్‌ను థియేట‌ర్లో నిషేధిస్తున్న‌ట్లు త‌మిళ‌నాడు థియేట‌ర్ య‌జ‌మానుల సంఘం వెల్ల‌డించింది.   ఇక థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు సైతం ఇంటర్వెల్‌ వస్తే కోక్‌,పెప్సీ వంటి శీతల పానీయాలు తప్పనిసరి.
Image result for జల్లికట్లు
విషయం తెలుసుకున్న వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాకు లాభాలకంటే తమిళ సాంప్రదాయం ముఖ్యం, అందుకోసం తాము ఎంతటి పోరాటానికైనా సిద్దం అని వ్యాపార సంఘాల నాయకులు తేల్చి చెప్పారు. కాగా మధురై, విరుద్ నగర్, రామనాథపురం తదితర ప్రాంతాల్లోని కొన్ని థియేటర్లలో పెప్సీ, కోకోకోలా కూల్ డ్రింక్స్ విక్రయాలను ఇప్పటికే నిలిపివేశారు. ఈ నిర్ణయంపై ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: