అనుమతి కోసం మళ్లీ పవన్ ట్వీట్లు :


జనవరి 26 న ప్రత్యేక హోదా కోసం మౌన ప్రదర్శనకు అనుమతి కోరుతూ పవన్ కళ్యాన్ మరోసారి ట్విట్స్ తో స్పందించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ యువత తలపెట్టిన శాంతియుత నిరసనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సినీనటుడు పవన్ కల్యాణ్ కోరారు. సోషల్ మీడియా ఆధారంగా చేపట్టే నిరసనలకు అనుమతి ఉండబోదని ఏపీ డీజీపీ, విశాఖ కలెక్టర్, పోలీసు కమిషనర్ తదితరులు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో పవన్ మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించారు. 


తెలంగాణలోని జిల్లాల పేర్లు మార్పు :


తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్య పెంచిన విషయం తెలిసందే.  తాజాగా ఐదు జిల్లాల పేర్లు మార్పులు చేర్పులు చేశారు.  భద్రాద్రి, జోగులాంబ, యాదాద్రి, రాజన్న జిల్లా పేర్ల చివర జిల్లా కేంద్రాల పేర్లను చేరుస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాలను భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్లా జిల్లాలుగా మార్చుతున్నట్లు ఆ శాఖ పేర్కొంది. అదేవిధంగా కొమురం భీం జిల్లా పేరును కుమురం భీం జిల్లాగా మార్చారు.  ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. కేటీ దొడ్డి మండలంలోకి ఏపీకొండనహల్లి గ్రామం చేర్చింది. గట్టు మండలంలోకి ముస్లీంపల్లె గ్రామం, ఉండవల్లి మండలంలోకి శాలిపూర్, ఖానాపూర్ గ్రామాలు, మనోపాడ్ మండలంలోకి మంగపేట, రాయిమాకులకుంట్ల, పొసలపాడు గ్రామాలు చేర్చారు.


మత్స్యకారుల అభివృద్ధి కృషి :

talasani-patnam

రాష్ట్రాన్ని చేపల హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. రాజేంద్రనగర్‌లోని ఏజీ కళాశాలలో.. మత్స్యకారులకు వాహనాలు పంపిణీ చేశారు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహేందర్‌రెడ్డి. మత్స్యకారులపై దౌర్జన్యాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌ పెడతామన్నారు మంత్రి తలసాని. అటు మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు మంత్రి మహేందర్‌రెడ్డి. జిల్లాలో 10 మినీ చేపల మార్కెట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇబ్రహీంపట్నంలో భారీ మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో చేపల పెంపకానికి రూ. 102 కోట్లు మంజూరు చేసిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. మత్స్యకారుల మీద, చెరువుల వద్ద అక్రమాలకు పాల్పడి దౌర్జన్యాలు చేస్తే వారిపై పీడీ యాక్ట్ అమలు పరుస్తామని చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: