విజయవాడ సర్వాంగా సుందరంగా ముస్తాబు అయ్యింది. పవిత్ర సంగమం వేదికగా నిర్వహిస్తున్న  జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. దేశంలోని  వివిధ రంగాలకు చెందిన 200 మంది మహిళా ప్రముఖులు ఈ సదస్సు లో పాల్గొంటున్నారు. కృష్ణ పుష్కరాలతో పునీతమైన పవిత్ర సంగమం మరో సారి ఈ మహోన్నత కార్యక్రమానికి వేదికగా నిలుస్తోంది.

 

విజయవాడ సర్వాంగా సుందరంగా ముస్తాబు అయ్యింది. దేశంలో మొట్ట మొదటి సారిగా  జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు విజయవాడలో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో దేశంలోని వివిధ రంగాలకు చెందిన 200 మంది మహిళా ప్రముఖులు పాల్గొంటున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సును నిర్వహిస్తుంది. అతిథులు విజయవాడలో అడుగు పెట్టిన నాటినుంచి..సదస్సు ముగిసి వారు వెళ్లే వరకు ఘనమైన ఆతిధ్యం ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్  స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది.

 

దేశంలోని వివిధ రంగాలకు చెందిన 200 మంది మహిళా ప్రముఖులు... 10  వేల మంది విద్యార్థినులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు , రాష్ట్ర మంత్రులతో పాటు బంగ్లాదేశ్ , ఆఫ్రికా , అమెరికా  సెనేట్ సభ్యులు, గ్రేట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్‌ ఈ సదస్సులో పాల్గొంటున్నారు.  పార్లమెంట్ స్పీకర్ సుమిత్ర మహాజన్ , కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, వెంకయ్య నాయుడుతో  కలిసి ఏపీ  సీఎం చంద్రబాబు నాయుడు ఈ సదస్సు ను ప్రారంభించారు. సినీ తారలు జుహీ చావ్లా, మనీషా కొయిరాలా, ప్రముఖ మహిళలు కిరణ్ బేడి, కరణం మల్లేశ్వరి, పి వి సింధు.. తదితరులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కాలేజీ నుంచి ఇద్దరు విద్యార్థినిలు, ప్రతి విశ్వ విద్యాలయం నుంచి ఒక బృందం విద్యార్థినులు ఈ సదస్సు లో పాల్గొనేలా అవకావం కల్పించారు. ఈ సదస్సు జరిగే మూడు రోజుల్లో  ఉదయం సమయంలో మహిళలు ప్రసంగాలు ఉంటాయి. మధ్యాహ్నం సమయం లో బృంద చర్చలు ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

 

ఈ సదస్సు  హాజరయ్యే వారికోసం  విజయవాడ బస్సు కాంప్లెక్స్,  రైల్వే స్టేషన్ నుంచి..సభా వేదిక పవిత్ర సంగమం వరకు  ఉచిత బస్సులు తిరగనున్నాయి. మొత్తం  2  వేల మంది వాలంటీరులను ఏర్పాటు చేసారు. అతిధుల సెక్యూరిటీ కోసం 1000  మంది పోలీసులు నియమించారు. సదస్సు ప్రాంగణంలో సీసీ కెమెరా లు .. డ్రోన్ లతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

 

ఈ సదస్సుకు హాజరుకాకపోయినా..ప్రత్యేక్షంగా చూసేలా.. టెక్నాలజీతో అందరికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సదస్సు జరగే సమయంలో  100 కాలేజీల్లోని విద్యార్ధినులు  లైవ్ టెలికాస్ట్  ద్వారా ఈ సదస్సును చూసే వీలు కల్పించారు.  ఆయా కాలేజీ విద్యార్ధినులు ప్రముఖులతో మాట్లాడవచ్చు. విద్యార్ధినులు అడిగే ప్రశ్నలకు మహిళా ప్రముఖులు సమాధానాలు  సైతం ఇవ్వనున్నారు.  గూగుల్, యాహు, ఇతర సోషల్ మీడియా లో ఈ సదస్సుకు విశేషంగా ప్రచారం కల్పించారు.  మొత్తం ఈ కార్యక్రమం అంతా  యూ ట్యూబ్  లో లైవ్ ద్వారా ప్రసారం చేయనున్నారు.

 

మొత్తానికి మూడు రోజుల పాటు జరిగే జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సును సూపర్ సక్సెస్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: