ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఎటు తేల్చుకోలేని ప‌రిస్థితి ఉంది.  టీడీపీలోకి వ‌ల‌స వ‌చ్చిన ఎమ్మెల్యేలు బుగ్గ కారు ఎక్కేందుకు ఉబ‌లాట‌ప‌డుతున్నారు. జంపింగ్ జ‌పాంగ్‌లు మంత్రి వ‌ర్గంలో చోటు కోసం పైర‌వీలు జోరుగా స్టార్ట్ చేయ‌డంతో ముందు నుంచి టీడీపీలో ఉన్న‌ వారు త‌ట్టుకోలేక‌పోతున్నారు. మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న వార్త‌లు రాయ లసీమ‌, కోస్తా జిల్లాల్లో పార్టీలోని అంత‌ర్గ‌త పోరును తీవ్ర‌త‌రం చేసింది. క‌ర్నూలులో వైసీపీ నుంచి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న భూమా కుటుంబంలో ఒక‌రికి మంత్రి ప‌ద‌వి గ్యారంటీ అనే చ‌ర్చ సాగుతోంది. 


అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కూ టీడీపీ జండా మోసిన శిల్ప సోద‌రులు అస్స‌లు స‌హించ‌లేక పోతున్నారు. పార్టీలో ఉండా లా ? వీడాలా ? అన్నంత సీరియ‌స్‌గా వీరు ఆలోచ‌న చేస్తున్నారు. ఇక తూర్పుగోదావ‌రి జిల్లాలో వైసీపీ నుంచి వ‌చ్చిన జ్యోతుల నెహ్రుకు కేబినెట్‌లో చోటు గ్యారంటీ అనే ప్ర‌చారం జ‌రుగుతుంది. రాబోయే ఎన్నిక‌ల దృష్ట్యా జ్యోతుల‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నే యోచ‌న‌లో బాబుగారు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌ద‌వి కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్న వారిలో ఇది క‌ల‌వ‌రం సృష్టిస్తోంది.
 
ఇక విశాఖ‌లో నిప్పు ఉప్పుల్లా ఉండే అయ్య‌న్న‌పాత్రుడు, గంటా శ్రీనివాస‌రావుల్లో ఒక‌రికి శాఖ మార్చే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. లోకేష్ అండ‌దండ‌లు ఉండ‌టంతో అయ్య‌న్న అనుచ‌రులు ధీమాగా ఉన్నారు . ఇది గంటా వ‌ర్గానికి రుచించ‌డం లేదు. ఏదేమైనా ఏపీ కేబినెట్ ప్రక్షాళ‌న వార్త‌లు అధికార పార్టీలో చిచ్చు రేపా యన్న‌ది మాత్రం వాస్త‌వం. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు హిట్‌లిస్ట్‌లో ఆ న‌లుగురు ఎవ‌రు? క‌్యాబినెట్ పున‌ర్విభ‌జ‌న నేప‌థ్యంలో బాబు ఎవ‌రెవ‌రిని టార్గెట్ చేయ‌బోతున్నారు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 

మ‌రో వారం రోజుల్లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌న్న ఊహాగానాలు ఏపీ పొలిటిక‌ల్ కారిడార్‌లో హాట్ టాపిక్‌. ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేల‌పై బాబుకు ఫిర్యాదులు అందాయి. స‌ద‌రు మంత్రుల వ్య‌వ‌హారికం పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాబ‌ట్టి కొంద‌రికి ప్ర‌మోష‌న్లు, మ‌రికొంద‌రికి డిమోష‌న్లు ఖాయం అన్న చ‌ర్చ సాగుతోంది. అయితే ఎవ‌రెవ‌రికి డిమోష‌న్ ఉంటుంది? అన్న ప్ర‌శ్న వ‌చ్చిన‌ప్పుడు మొట్ట‌మొద‌ట‌గా ఓ రెండు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో శ్రీ‌కాకుళానికి చెం ప్ర‌ముఖ నేత ఎర్ర‌న్నాయుడు సోద‌రుడైన అచ్చెన్నాయుడుకి డిమోష‌న్ త‌ప్ప‌ద‌న్న మాట వినిపిస్తోంది. 

అచ్చెన్న వ్య‌వ‌హారికంపై బోలెడ‌న్ని ఫిర్యాదులందాయి. ఇక మ‌రో సీనియర్ గంటా శ్రీ‌నివాస‌రావు ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌. కాపు నేత అయిన గంటాపై బాబు చాలాకాలంగానే టార్గెట్ చేశారు. విశాఖ రాజ‌కీయాల్లో చిన‌బాబు వేలు పెట్ట‌డంతో గంటాకి ఇద్ద‌రికీ పొస‌గ‌డం లేద‌న్న టాక్ ఉంది. ఇక లేడీ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని ఫ్యామిలీ చేస్తు న్న దందాల‌పైనా తీవ్ర ఆరోప‌ణ‌లు ఉన్న నేప‌థ్యంలో త‌ను కూడా ఓ టార్గెట్‌. మంత్రి నారాయ‌ణ సైతం చీవాట్లు ప‌డాల్సొస్తోంది. అయితే అత‌డు ప్ర‌స్తుతం కీల‌క‌మైన ఏపీ- సీఆర్‌డీఏ బాధ్య‌త‌లు నెత్తికెత్తుకున్నారు కాబ‌ట్టి ఏం జ‌రుగుతుందో వేచి చూడాల్సిందే. ఇక లోకేష్ నాయుడు మంత్రి అవ్వ‌డానికి ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న‌లు సిద్ధ‌మైపోయాయి.

అయితే మార్చి తరువాత అంటే ప్రభుత్వం ఏర్పాటై మూడు సంవత్సరాలు కావడంతోపాటు నాలుగో సంవ త్సరంలో మంత్రి పదవులు తీసుకుని మరో ఏడాదిలోగా ఎన్నికలకు సన్నద్ధం కావాలంటే కష్టం కావడంతో ఎంత మంది పదవుల కోసం ముందుకు వస్తారన్నది కూడా సందిగ్ధంగా మారింది. మరోవైపు విస్తరణకు ఫిరా యింపుల చట్టం కూడా అడ్డు రావడంతో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ అందుకు సమ్మతించలే దన్న ప్రచారం కూడా సాగుతోంది. విస్తరణకు అవకాశం ఇస్తే పార్టీలో కొత్తగా చేరిన వారికి కాకుండా పార్టీ తరపున గెలిచిన వారికే అవ కాశం ఇవ్వాల్సి ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విషయాన్ని ప్రస్తుతం పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. 

మరోవైపు పార్టీ లో పదవులు ఆశించి చేరిన సీనియర్‌ నాయకులు కూడా పదవుల కోసం ఎదురుచూపులు చూడా ల్సి వస్తోంది. పదవుల విషయాన్ని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించినా చూద్దామని దాట వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విస్తరణ కన్నా ప్రభుత్వ పధకాలు ప్రజలకు చేరువ కావ డంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి కేంద్రీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: