స్వయంగా ఎన్టీఆరే తన అల్లుడు చంద్రబాబును తార్పుడు గాడు అని, రెండు వందల కోట్లు తినేశాడని అన్నారని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినీ నటుడు ఎన్టీఆర్ గురించి ఏం మంచి ఉందని చెప్పమంటారు?' అని నాదెండ్ల భాస్కరరావు ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.  ‘ఆ రోజు మీడియా అంతా నేను దుర్మార్గుడిని, ఎన్టీఆర్ సన్మార్గుడు అన్నట్లుగా చిత్రీకరించింది.


Image result for nadendla bhaskara rao

ఆయన చేసిన పాపాలన్నీ చెబితే ‘తూ’ అని ఉమ్మేస్తారు. ఎన్టీఆర్ ను అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో నేను ఎప్పుడూ తప్పుడు సలహాలు ఇవ్వలేదన్నారు.  ‘ఎన్టీఆర్ ను నేను వెన్నుపోటు పొడిచాననడం చాలా తప్పు. ఎన్టీఆరే నన్ను వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీఆర్ కు నేను వెన్నుపోటు పొడిచాననేది.. పత్రికలు చేసిన పని. పొలిటికల్ గా నాకు ఉన్న స్కిల్స్, ఎన్టీఆర్ చరిష్మా కారణంగానే కాంగ్రెస్ పార్టీని పడగొట్టాం. గంగా, యమున ఏకమయ్యాయి, కనుక, కాంగ్రెస్ పార్టీ  పడిపోయింది.


Image result for nadendla bhaskara rao

 నాడు చంద్రబాబు సలహాలు చెబుతుండేవాడు. ఆ సలహాలను విని పూనకంతో ఎన్టీఆర్ వచ్చేవాడు.... రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం గురించి ఎన్టీఆర్ కు ఏం తెలుసు?’ అని నాదెండ్ల భాస్కరరావు అన్నారు. తానేమి ఇంటెలెక్చువల్ ని కాదని, అలా అయితే, రామారావు చేతిలో తాను వెన్నుపోటుకు ఎందుకు గురవుతానంటూ తనదైన శైలిలో అన్నారు. రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారు కనుక, సినిమా వాళ్లు సీఎంలు అయ్యారని ఒక ప్రశ్నకు సమాధానంగా నాదెండ్ల సమాధానమిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: