2019 ఎన్నిక‌లు దగ్గ‌ర ప‌డుతున్నా కొద్ది  ఏపీ అధికార పార్టీలో ముస‌లం మొద‌లైన‌ట్టుగా క‌న‌బ‌డుతుంది. ఇప్ప‌టి కే కొంత మంది పార్టీలో చేరి త‌ప్పు చేశామ‌ని బాహాటంగానే ప్ర‌క‌టించుకుంటే మ‌రి కొంత మంది మాత్రం లోలోప ల మ‌ద‌న ప‌డుతున్న‌ట్లుగా క‌న‌బ‌డుతుంది. ఇక  కర్నూలు జిల్లా రాజకీయాలు టిడిపికి తీవ్ర నష్టాన్ని కలిగించేలా సాగుతున్నాయి. ఇప్పటికే టిడిపి నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డి వైసిపిలోకి వెళ్లడంతో మరికొంత మంది అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా పార్టీ సీనియర్లు కీలకనేతలు కావడంతో అధిష్టానం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. 

జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి టిడిపిలోకి రావడం, అతనికి మంత్రి పదవి దక్కను న్నట్లు లీకులు రావడంతో అతని వ్యతిరేక వర్గం, అసంతృప్తులు వైసిపి బాట పట్టను న్నట్లు తెలుస్తోంది.జిల్లాలో తెలుగు దేశం పార్టీ కంటే వైసిపి బలంగా ఉంది. టిడిపిని జిల్లాలో బలోపేతం చేయడనికి చంద్రబాబు అప్పట్లో వలసలను ఆహ్వానించా రు. కానీ ఆ వ్యూహం బెడిసి కొట్టినట్లు కనిపిస్తోంది. జిల్లాలో భూమా వర్గానికి వ్యతిరేకులైన శిల్పా బ్రదర్స్ వర్గం త్వరలో టిడిపికి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. శిల్పా బ్రదర్స్ మొదటి నుంచి భూమా చేరికని వ్యతిరేకిస్తున్నారు. 

కాగా తాజాగా అతనికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుండడంతో టిడిపి జిల్లా అధ్యక్షు డైన శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో చంద్రబాబు వారి ని బుజ్జగించాడనికి కర్నూలు ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డిని రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. శిల్పా బ్రదర్స్ పార్టీని వీడితే జిల్లాలో టిడిపి బలం బాగా తగ్గిపోయినట్లే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రెండు కళ్ల సిద్ధాంతం తెలుగుదేశానికి ఏమీ కొత్త కాదు కాబట్టి... నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడం పెద్ద కష్టం ఏమీకాదు కాబట్టి... భూమాకు కానీ, చాంద్‌భాషాకు కానీ పదవి దక్కే అవకాశం ఉంది. 

అయితే... అదే జరిగితే, మరోరకంగా రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉంది. భూమాకు పదవిని ఇస్తే తాము పార్టీని వీడతామని శిల్పావర్గం స్పష్టం చేసింది ఇప్పటికే భూమాతో ఆది నుంచి అమితుమి తలపడుతూ వస్తున్న శిల్పా వర్గం ఇప్పుడు అల్టిమేటం ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యం లేదు! భూమాకు పదవిని ఇస్తే వాళ్లు తక్ష ణం తెలుగుదేశానికి రాజీనామా చేసి వైకాపాలో చేరే అవకాశాలున్నాయి. అది వారికి ఏమాత్రం కష్టంకాదు! ఇక భూమాకు మంత్రి పదవిని ఇవ్వకపోవడం... ఈ కోణం నుంచి చూస్తే చంద్రబాబు కొంత వరకూ సేఫే! కానీ... ఇర వై మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే వారిలో చాలా మందికి మంత్రి పదవి హామీలు ఇచ్చారు. 

ఎవ్వరికీ పదవిని ఇవ్వకుండా బండిలాగించడం కష్టం. అలాగని ఏ ఉత్తరాంధ్రలోని వారిని కేబినెట్‌లోకి తీసు కుని, భూమాను తీసుకోకపోతే  అప్పుడు వీళ్లు కస్సుమంటారు! అయితే అలాంటి కస్సుబుస్సులను బాబు లెక్క చేయకపోవచ్చు. కానీ,  మరోసారి హామీని పొంది మోసపోవడం భూమా కుటుంబానికి అనుభవంలోకి వస్తుందం తే! ఇక ఫిరాయింపు రాజకీయాల సంగతిలా ఉంటే,  పాతకాపుల రచ్చ ఉండనే ఉంది. ఇప్పటికే పార్టీ అధికారం లోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. ఇంక రెండేళ్లలో ఈ పాటికి ఎన్నికల నోటిఫికేషన్‌ విడదల అయిపో తుంది. దీంతో  చాలా మందికి మంత్రి పదవుల ప్రయత్నాలకు ఇదే తుదిగడువు అవుతోంది. 

ఇప్పుడు దక్కితే ఫర్వాలేదు లేకపోతే  ఇక దక్కదు అనే స్థితి ఉంది. దీంతో అందరూ ఒక్కసారిగా అలర్ట్‌ అవుతు న్నారు! తెలుగుదేశంలోని పాతకాపుల్లో మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వారి జాబితాను పరిశీలిస్తే అది చాలా పెద్దదే అవుతుంది! అనంత నుంచి పయ్యావుల కేశవ్‌, బాలకష్ణ, పార్థసారథి వంటి వాళ్లు ఆశలు పెట్టుకు న్నారు. ఇక కర్నూలు లో ఫిరాయింపుల రచ్చ ఉంది. చిత్తూరులో పాతకాపులు, కొత్తగా వచ్చిన వారు ఆశావహుల జాబితాలో ఉన్నారు. కడపలో సతీష్‌రెడ్డి వంటి వాళ్లు తమ ప్రయత్నాల్లో తామున్నారు. అయితే, బాబు తీరు చూస్తుంటే సీమలో ఎవరికీ కొత్తగా అవకాశాలు దక్కేలా కనిపించడం లేదు!

ఉన్నవారినే తొలగించే అవకాశాలున్నాయి. పల్లె, బొజ్జల ఇద్దరినీ కేబినెట్‌ నుంచి తప్పిస్తారనే మాట వినిపి స్తోంది. వీరిని అసమర్థుల కోటాలో తొలగించవచ్చట. మరి బాబు భజన చేయడంలో పల్లె రఘునాథరెడ్డి అంత సమర్థతను కనబరుస్తున్నా.. ఆయనను అసమర్థుడు అనడం విడ్డూరమే! పల్లె, బొజ్జలను ఇద్దరినీ కేబినెట్‌ నుంచి తొలగించి నా  అడిగే వారు ఎవరూ లేరు. కాబట్టి  ఆ విధంగా ముందుకు పోవచ్చు. కొత్తగా రాయలసీమ రెడ్డి వర్గానికి ప్రాతినిధ్యం దక్కకపోయినా  ఉన్న వారిని తొలగించడం మాత్రం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఇక మరో మంత్రి పరిటాల సునీత మాత్రం కులం కోటాలో పదవిని నిలుపుకోవచ్చనే మాట వినిపిస్తోంది.

మంత్రిగా సునీత సాధించిన అద్భుతాలు ఏమీ లేకపోయినా  పైపెచ్చూ పక్క నియోజకవర్గాల వ్యవహారాల్లో వేలు పెడుతూ నష్టం చేస్తున్నా  ఆమెను కులం రక్షిస్తుందనే విశ్లేషణ వినిపిస్తోంది. అయితే స్వకులస్తుడు పయ్యావుల నుంచి మాత్రం ఆమెకు పోటీ ఉంది. ఇక మరో పోటీదారు బాలకష్ణకు మాత్రం అవకాశాలు మగ్యం అయినట్టే! మంత్రి పదవి మీద చాలా ఆశలనే పెట్టుకుని ఉన్న బాలయ్యను వ్యూహాత్మకంగా దెబ్బతీశారు చంద్రబాబు. బాల య్య పీఏ పై తెలుగుదేశం ఎమ్మెల్యేల రచ్చ వెనుక కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని విశ్లేషకులు అంటు న్నారు. 

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో బాబుపై బాలయ్య ఒత్తిడి పెంచుతున్న క్రమంలో దాని నుంచి విముక్తి పొంద డానికి పీఏ రగడను రైజ్‌ చేసి, బాలయ్యను కట్టడి చేయడం లో బాబు విజయవంతం అయ్యాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మంత్రిపదవి విషయంలో బాలయ్య ఆశలకు పూర్తిగా గండి పడిందంటు న్నారు! ఏతా వాతా.. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో సీమ నుంచి ఉన్న వాళ్ల పదవులు పోవడమే తప్ప.. కొత్తగా చేర్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: