అంద‌రు అనుకున్న‌ట్టుగానే జ‌న‌సేనాని, జ‌న‌సేన పార్టీ వ్య‌వ‌స్థాప‌క‌ధ్య‌క్షుడు ప‌వన్ క‌ళ్యాణ్  2019 ఎన్నికలకు సం బంధించి ఓ క్లారిటీ ఇచ్చారు. తనకు అధికారం ముఖ్యం కాదని, అధికారంలో లేకపోయినా సేవ చేయగల మని గతంలో ఎందరో నిరూపించారని, అందువల్లే తనకు అధికారం అక్కరలేదని ఆయన చెప్పేసారు. అయితే అలా అని ఊరుకోనని, కొన్ని స్థానాల్లో మాత్రం 2019లో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. అంటే దీన్ని బట్టి పవ న్ 2019 లో పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని అర్థం అయిపోతోంది. 


చంద్రబాబు భాజపా చేయి వదిలి, పవన్ తో కలిసి పోటీ చేసి, జగన్ ను ఢీ కొనడానికి వ్యూహరచన చేస్తున్నారన్న వార్తలు ఇన్నాళ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పవన్ ఇచ్చిన క్లారిటీతో ఇవే వార్తలు నిజం అయ్యే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు తెరవెనుక వుండి అండ అందించిన పవన్, 2019 ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే జనసేనకు కార్యకర్తలు అనేకంగా సిద్ధంగా వున్నారని, నాయకులే కావాలని, అయితే జంపింగ్ జిలానీలు కాకుండా, స్థిరంగా ప్రజల తరపున పోరాట పటిమ వున్న యువ నాయకుల కోసం చూస్తున్నానని, అలాంటి వారు తనకు కావాలని ఆయన పిలుపు నిచ్చారు.

మార్చి 14 న జనసేన తరపున వెబ్ సైట్ ప్రారంభిస్తున్నానని, అందులో వివిధ పాలసీలపై, సమస్యలపై అభి ప్రాయాలు వుంటాయని ఆయన వున్నారు. ఇవన్నీ కలిసి మానిఫెస్టో తయారుచేస్తామన్నారు. నేడు గుంటూ రు జిల్లాలోని మంగళగిరిలో జరిగిన చేనేత సత్యాగ్రహ సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అక్కడ సత్యాగ్రహం చేస్తున్న సభ్యులకు తన సంఘీభావం తెలిపి వారి చేత నిమ్మరసం తాగించి దీక్షను విరమింప జేశారు. అనంత రం పవన్ మాట్లాడుతూ ‘సత్యాగ్రహం అంటే నిజమైన ఆగ్రహం. ఇప్పుడు చేనేత పరిశ్రమ చేస్తున్నది అదే. నా దృష్టిలో చేనేత వారు కార్మికులు, కూలీలు కాదు. వాళ్ళు నా దృష్టిలో కళాకారులు. 

ఇప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. నేను చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని అన్నప్పుడు కొందరు అన్నం పెట్టేవారిని వదిలి ఎంగిలాకులు ఏరుకునే వారి వద్దకు వెళతారేమిటి అన్నారు. ఆ మాటలు నాకు భాధ కలిగించలేదు. కనీసం నాకు దేవుడు శుభ్రం చేసే వృత్తినైనా ఇచ్చాడు అని సంతోషిస్తాను. ప్రభు త్వం ఎన్నికల సమయంలో ఈ కళాకారులకి ఇచ్చిన మాటలను గుర్తు చేసుకోవాలి. వీరి బాగు కోసం పని చేయా లి. పవర్ లూమ్స్ ద్వారా వీరి ఆదాయాన్ని దోచుకుంటున్న వారిని ప్రభుత్వం ఎందుకు ఆపుచేయడం లేదు. చేనేత సభ్యులు కూడా ఈ సమస్యలను మానిటరింగ్ చేసుకోవాలి అన్నారు.

అలాగే నేను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు. అధికారం ఉంటేనే సేవ చేస్తామనేది నా దృష్టిలో ఒట్టి మాట. 2019 లో వీలైనంత వరకు పోటీ చేస్తానని చెప్పాను. అలాగే చేస్తాను. చేనేతల గొంతుక అసెంబ్లీల బలంగా వినిపిస్తాను. నేను ముందే చెప్పినట్టు ప్రపంచంలో ఉన్న తెలుగువారు వారానికి ఒకరోజూ చేనేత వాడితే సమస్య లు తీరతాయి. నేను బ్రతికున్నంత వరకు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను’ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: