తిరుమలలో కేసీఆర్.. ఘన స్వాగతం.. 
kcr in tirumala కోసం చిత్ర ఫలితం

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  శ్రీవారి దర్శనార్థం..  తిరుమలకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన  హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకొన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల కొండకు వచ్చారు.  తిరుమల శ్రీకృష్ణ అతిథి గృహం చేరుకొన్న ఆయనకు  ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం  ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొంటారు. ఐదుకోట్ల రూపాయలతో  ప్రత్యేకంగా చేయించిన సాలిగ్రామ హారం, కంఠెహారాలను స్వామివారికి సమర్పిస్తారు.


ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దతపై బాబు దీమా... 

chandrababu naidu కోసం చిత్ర ఫలితం

కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై చట్టబద్ధతపై చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు. రేపటి కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఒక స్పష్టత రావచ్చని ఆయన తెలిపారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖాధిపతుల సమావేశం నిర్వహించారు. మంత్రులతోపాటు శాఖాధిపతులు, కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు,  ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులు దీనిలో పాల్గొన్నారు. మార్చి 6 నుంచి బడ్జెట్  సమావేశాలు ప్రారంభంకానున్నట్లు సీఎం తెలిపారు. మార్చి 13న బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు.  

కేసీఆర్ పై యుద్ధం ప్రకటించిన కోదండరామ్.. 

kodandaram sir latest కోసం చిత్ర ఫలితం

నాటకీయ పరిణామాలు, పోలీసుల నిర్బంధం మధ్య తెలంగాణ జేఏసీ నిరుద్యోగ నిరసన ర్యాలీకి సిద్దమయింది. బుధవారం ఉదయం పది గంటలకు   సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ నిర్వహించేందుకు  ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున జిల్లాల నుంచి విద్యార్థులు, నిరుద్యోగ యువకులు తరలి వస్తారని  ఐకాస నేతలు భావిస్తున్నారు. పోలీసులు అనుమతించకపోవడంతో ఈ కార్యక్రమ నిర్వహణ ఉత్కంఠగా మారింది. ఎక్కడ పోలీసులు అడ్డుకుంటే అక్కడే నిరసన దీక్షలకు కూర్చోవాలని కోదండరామ్ పిలుపు ఇచ్చారు. 


ఆంధ్రాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల... 

సంబంధిత చిత్రం


ఏపీ రాష్ట్రంలో7 స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్  విడుదలైంది. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 28 న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు మార్చి 7 చివరి తేదీ కాగా...మార్చి 8 న నామినేషన్ల పరిశీలన జరగనుంది. మార్చి 10 నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మార్చి 17 న ఉదయం 9 గంటల  నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక నిర్వహించి...మార్చి 17 సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 


ఆంధ్రాలో ఇంటర్ పరీక్షల్లో జంబ్లింగ్.. 


ఇంటర్మీడియల్  పరీక్షల్లో జంబ్లింగ్ పద్దతిలో నిర్వహిస్తామని..  ప్రయోగ పరీక్షలకు ల్యాబ్ సౌకర్యం కల్పించని యాజమాన్యాలపై చర్య తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మార్చి 1వ తేదీ నుంచి జరిగే ఇంటర్ మీడియట్ పరీక్షలకు గత ఏడాది కన్నా 14 శాతం మంది విద్యార్థులు అధికంగా  హాజరవుతున్నారని అన్నారు. స్పాట్ వాల్యూషన్ చేసే కేంద్రాల్లోనూ సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 1435 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన ఆయన....ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మార్చి 9న జరగాల్సిన పరీక్షను 19వ తేదికి వాయిదా వేసినట్లు వివరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: