వైసీపీలో జగన్  తర్వాత పాపులారిటీ ఉన్న నేతగా రోజా గుర్తింపు పొందుతున్నారు. చంద్రబాబు, లోకేశ్ వంటి వారిపై మాటల దాడి చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా టీడీపీ సర్కారు నిర్వహించిన ప్రపంచ మహిళా సదస్సులో ప్రసంగించేందుకు ప్రయత్నించి అరెస్టయి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఐతే.. రోజా ప్రయత్నాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు.  

roja pressmeet కోసం చిత్ర ఫలితం

పీతల సుజాత కూడా రోజాపై దాడి తీవ్రం చేశారు. మహిళా సదస్సును అడ్డుకుంటామని  ప్రకటనలు చేసినందుకు  ఎమ్మెల్యే రోజాను పోలీసులు సభకు అనుమతించ లేదన్నారు.  రోజాను గౌరవ మర్యాదలతో పోలీసులు తన ఇంటి వద్ద దింపారని అన్నారు. న్యాయపోరాటం చేస్తామంటున్న రోజా ఎందుకో ప్రజలకు తెలపాలన్నారు. సొంత తమ్ముడిని కాదని నీకు చంద్రగిరి సీటు ఇచ్చినందుకు చంద్రబాబుపై న్యాయపోరాటం చేస్తావా అని రోజాను మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు. 

peetala sujatha కోసం చిత్ర ఫలితం

మహిళా ఐఏఎస్ లను జైలుకు పంపిన జగన్ పై రోజా న్యాయపోరాటం చేయాలన్నారు.జగన్, రోజాలకు ప్రజా సంక్షేమం కన్నా పబ్లిసిటీపైనే ఎక్కవ మోజు అని పీతల సుజాత మండిపడ్డారు. రోజా చేస్తున్న వ్యాఖ్యలు.. మహిళలు తలదించుకునే రీతిలో ఉన్నాయని ప్రభుత్వ విప్ యామినీబాల అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా మహిళా సదస్సు నిర్వహిస్తే.. దానిని కూడా రాజకీయ చేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఆమె అనంతపురంలో వ్యాఖ్యానించారు. 

yamini bala కోసం చిత్ర ఫలితం

జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా ఎదుర్కోవాలి కాని.. ఇలా రోజాతో మాట్లాడించడం సరికాదని యామినీ బాల హితవు పలికారు. ఎవరి హయాంలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా పురోభివృద్ధి సాధించారో.. ఎవరిలో ఎక్కువ మంది హింసకు గురయ్యారో చర్చ కు సిద్ధమా యమానినీబాల  అని సవాల్ విసిరారు. రోజా ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోకపోతే మహిళలంతా ఏకమై తరిమికొడుతారని హెచ్చరించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: