తిరుపతి పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ సర్కారు ఘన స్వాగతం పలికింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలసి రేణిగుంట విమానాశ్రయం చేరుకొన్నా ఆయనకు రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకొన్నారు. 

ysp-mp-mlas-meet-cm-kcr-tpt
తిరుమలలో తితిదే అధికారులు కేసీఆర్ కు సాదరంగా స్వాగతం పలికారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలసి ఆయన తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహంలో బసచేశారు. దాదాపు 9 ఏళ్ల తర్వాత తిరుమలకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వచ్చిన కేసీఆర్ ను అనేక మంది ప్రముఖులు వచ్చి కలిశారు. 

65565
ఐతే.. శ్రీకృష్ణ అతిథి గృహంలో బసచేసిన కేసీఆర్ ను చిత్తూరుజిల్లా వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి కలవడం ఆసక్తి కలిగిస్తోంది. సాధారణంగా ప్రభుత్వం తరపున ఆహ్వానించడం టీడీపీ నేతలకు తప్పని పరిస్థితి. కానీ వైసీపీ నేతలు కూడా వచ్చి ఎందుకు కలిశారన్నది పొలిటికల్ సర్కిళ్లో చర్చ రేపుతోంది. 


కేసీఆర్ తో సత్సంబంధాలు నెరపుకునే పనిలో వైఎస్ జగన్ ఎంపీతో రాయబారం పంపి ఉంటారని కొందరు విశ్లేషిస్తుంటే.. ఆహ్వానించడంలో.. మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో తప్పేముందని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా వైసీపీ నేతలు తెలంగాణ సీఎం ను అందులోనూ తిరుమల వంటి ఆధ్యాత్మిక ప్రాంతంలో కలవడం విశేషమే. 
కేసీఆర్ తిరుమల పర్యాటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: