నిరుద్యోగుల ర్యాలీకి అనుమతి ఇస్తామన్నా కోదండరాం ఎందుకు కాదన్నారు? నిరుద్యోగుల సమస్యను ఫోకస్‌ చేయటం కంటే కూడా, ర్యాలీ నిర్వహించే స్థలం- తేదీ విషయంలో ఆయన ఎందుకంత పట్టుదలతో వ్యవహరించారు?’ అని తటస్థులు కూడా అంతుబట్టని అయోమయంలో పడిపోయారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవ డమే ఆయన ప్రధాన ఉద్దేశమైతే, స్థలం లేదా తేదీ విషయంలో పెద్దగా పట్టింపులుండాల్సిన అవసరం లేదని, అంతకుమించి కారణాలేవో ఉండడం వల్లే ఆయన మొండిగా ముందుకు సాగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమ వుతోంది. 


‘‘ఉద్యమమైనా, ఆందోళనైనా కొంత పట్టు విడుపు అవసరం. ఒక సమస్యను సర్కారు దృష్టికి తీసుకురావాలను కున్నప్పుడు, ఇతరత్రా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పిన రోజు, నేను చెప్పిన చోట నిర్వహించి తీరతామనడం, అసలు ఉద్దేశాన్ని మించి వేరే అనుమానాలు కలిగిస్తున్నది. అనుమతి కోసం వారే హైకోర్టుకు వెళ్లి, తీరా జడ్జి కొన్ని సూచనలతో అనుమతిస్తున్న సమయంలో పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం దీన్ని బలపరుస్తున్నది. న్యాయమూ ర్తుల సూచనలను కూడా పట్టించుకోబోమంటే ఎలా?’’ అని ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ముఖ్య నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

వాస్త‌వానికి నిరుద్యోగుల ర్యాలీ నిర్వహిస్తామన్నారు.. అనుమతి కోసం హైకోర్టుకు వెళ్లింది కోదండ‌రామే. అయితే ఇవ్వడానికి న్యాయమూర్తి అంగీకరించారు.. బుధవారం రోజే ర్యాలీ చేస్తామంటే నాలుగు చోట్ల నాగోల్‌, మియాపూర్‌, ఉప్పల్‌, రింగ్‌ రోడ్డు పరిధిలో ఏదో ఒకచోట అనుమతి ఇప్పిస్తామని జడ్జి భరోసా ఇచ్చారు. సభకు సహకరించాల్సింది గా పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తామని, ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు కల్పించాలని కూడా చెబుతామని స్పష్టం చేశారు. కాదూ.. నగరం లోపలే, వారు కోరిన ప్రదేశం లోనే ర్యాలీ జరుపుకోవాలనుకుంటే సెలవు రోజుల్లో శుక్ర లేదా ఆదివారాల్లో అనుమతిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు. 

ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడానికి న్యాయమూర్తి సిద్ధమవుతుండగానే హైకోర్టులో పిటిషన్‌ను జేఏసీ అర్ధాంత రంగా ఉపసంహరించుకోవడం వివాదాస్పదమవుతోంది. తాము ప్రకటించిన రోజే, ప్రకటించిన చోటే ర్యాలీ నిర్వ హించి తీరతామని కోదండరాం భీష్మించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. కోదండరాం- జేఏసీ మంకుపట్టు కు కారణాలేమిటి? అసలు ర్యాలీ ఉద్దేశాలేమిటి? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ‘‘ప్రభుత్వంపై జల్లికట్టు తరహా ఉద్యమం చేయాలని కొంతకాలం క్రితం కోదండరాం అన్నారు. ఆప్‌ తరహా వేదిక అని కూడా మాట్లాడా రు.
 
ఆ రెండు ఆందోళనలూ ఎలా మొదలై, ఎన్ని రోజులు సాగాయో దేశంలో అందరికీ తెలుసు. అందువల్లే ప్రభు త్వం ముందే అనుమానపడింది. రాష్ట్రంలో ప్రశాంతత చెద రకుండా తగిన జాగ్రత్తలతో ఉంది. అర్ధాంతరంగా జేఏసీ పిటిషన్‌ ఉపసంహరణతో మా అనుమానాలు మరింత బలపడ్డాయి. అసలు సమస్యను మించిన దురు ద్దేశం ఆయనకున్నట్టు మేం మొదటి నుంచీ అనుమానిస్తున్నాం’’ అని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు వ్యా ఖ్యానించారు. వేరే చోట అనుమతిస్తామన్నా నిరాకరించటం అంటే, ర్యాలీ పేరుతో నగరం నడిబొడ్డున అశాంతి, అల్లరికి కోదండరాం అండ్‌ కో ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు భావించాల్సి వస్తోందని ఆయన చెప్పారు. 

నిరసన ర్యాలీ ద్వారా నిరుద్యోగ సమస్యను అందరి దృష్టికి తీసుకురావటం కంటే కూడా, ప్రభుత్వంపై బురద చల్లటమే కోదండరాం కోరిక అని టీఆర్‌ఎస్‌ వర్గాలు అభి ప్రాయపడ్డాయి. ‘‘టీ జేఏసీ కోరుకున్నచోట కాకుండా నాగోల్‌లో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వటానికి దాదాపుగా రంగం సిద్ధమైంది. ఆలోపే టీ జేఏసీ తన పిటి షన్‌ను ఉపసంహరించుకుంది. ర్యాలీ, సభ కన్నా తన పంతం నెగ్గించుకోవడమే కోదండకు ముఖ్యం. ఈ క్రమం లో ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతలను, యువతను కూడా లెక్క చేయడం లేదన్న సంగతి దీంతో స్పష్టమైం ది’’ అని అధికార పార్టీ ముఖ్యుడొకరు తప్పుబట్టారు. 

‘‘నిరుద్యోగుల సమస్యను ర్యాలీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నదే టీజేఏసీ ఉద్దేశం అనుకుంటే, ఆ ర్యాలీని, సభను రాష్ట్రంలో ఎక్కడ నిర్వహించినా ఒక్కటే. నిజంగా వారికి నిరుద్యోగులపై ప్రేమ ఉంటే, ర్యాలీ నిర్వహణకు ఎక్కడ అనుమతి ఇచ్చినా తీసుకునే వారు’’ అని ఆయన విశ్లేషించారు. ‘‘ఉద్యమ సమయంలో చాలా పోరాటాలు జరిగాయి. చాలా సందర్భాల్లో వాటిని పోలీసులు, కోర్టులు విధించిన షరతులకు లోబడి నిర్వ హించారు. ఇది కోదండకు కూడా తెలుసు. అయినా, ఆయన మంకుపట్టు పడుతున్నారు. సమస్యకు పరిష్కారం కన్నా, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయటమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: