రోజా.. ఈ పేరులో వైబ్రేష‌న్స్ క‌నిపిస్తాయి. ఓవైపు త‌నకు లైఫ్ ఇచ్చిన సినీ ఇండ‌స్ట్రీని క్యారీ చేస్తూ మ‌రో వైపు రాజ‌కీయంగాను త‌న‌దైన శైలిలో రాణిస్తూ  ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర‌వేసుకున్నారు. మ‌హిళ‌ల‌కు స‌మాజంలో జ‌రుగుతున్న అన్యాయంపై గ‌ళం విప్పారు, మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై పార్టీల‌తో సంబంధం లేకుండా పోరాడారు. తెలుగుదేశంలో ఉన్నా... వైసీపీలో ఉన్నా ఎక్క‌డైనా స‌రే మ‌హిళ‌ల ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పైనే ప్ర‌ధానంగా మాట్లాడారు. ఒక రిషితేశ్వ‌రి ఘ‌ట‌న‌, ఒక వ‌న‌జాక్షి ఘ‌ట‌న‌, కాల్ మ‌నీ వ్య‌వ‌హారం నిన్న మొన్న అనంత‌పురంలో అధికార పార్టీ వారు ఓ మ‌హిళ‌పై అరాచ‌కంగా ప్ర‌వ‌ర్తించిన ఘ‌ట‌న‌ల‌పై రోజా గ‌ళం విప్పిన సంగ‌తి తెలిసిందే. అలాంటి ఫైర్ బ్రాండ్ అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ అయి ఏడాది పూర్తి అయ్యింది. రోజా ఫేట్ ఎలా ఉండ‌బోతోంది
Related image
మార్చి 6 నుంచి ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌వుతున్నాయి. అయితే ఈ సారి స‌మావేశాల‌కంటే ముందే అంద‌రిలో ఆస‌క్తి రేపుతున్న చ‌ర్చ రోజాకు స‌భ‌లో ఎంట్రీ ఉందా లేదా..? 2017 డిసెంబ‌ర్ 18న కాల్‌మ‌నీ అంశంపై చ‌ర్చ‌లో భాగంగా రోజాను అనుచింతంగా ప్ర‌వ‌ర్తించిందంటూ శాస‌న‌స‌భ ఏడాది పాటు స‌స్పెండ్ చేసింది. దీనిపై శాస‌న‌స‌భ న్యాయవ్య‌వ‌స్థ మ‌ద్య పోరాట‌మూ సాగింది.
Image result for roja

ఏది ఏమైనా  స‌భే సుప్రీమంటూ  ప్ర‌భుత్వం రోజాకు నో ఎంట్రీ అంది. ఇదే స‌మ‌యంలో రోజా త‌న‌ను అనుచిత వ్యాఖ్య‌లు చేసిందంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత చేసిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ క‌మిటీ రోజాను విచారించింది. రోజా క్ష‌మాప‌ణ చెప్పింది. కానీ క‌మిటీ ఇంత‌వ‌ర‌కు త‌మ రిపోర్ట్ ఏమిట‌న్న‌ది బ‌య‌ట‌పెట్ట‌లేదు. 

Image result for roja

ఇదే స‌మ‌యంలో ఏడాది కాలం స‌స్పెన్ష‌న్ ముగిసిపోయింది. తాజాగా మ‌హిళా పార్ల‌మెంట్ స‌మావేశం సంద‌ర్భంగా రోజాపై వ్య‌వ‌హారం ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. రోజాకు సింప‌థీ వ‌చ్చేసింద‌నీ ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో టెన్ష‌న్ మొద‌లైంది. మ‌రి ఈ టెన్ష‌న్ న‌డుమ స‌భ‌లో మ‌రోసారి రోజా క్ష‌మాప‌ణ చెప్పాలంటూ స‌భ‌లోప‌లికి అవ‌కాశం క‌ల్పిస్తారో లేదు లేదు రోజా అడుగుపెట్టేందుకు వీలు లేదంటూ మ‌రోసారి వేటు వేస్తారా అనేదే ఇప్పుడు పొలిటిక‌ల్ సెక్ష‌న్‌లో హాట్ టాపిక్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: