కలసి ఉంటె కలదు సుఖం అనే కాన్సెప్ట్ ని తెలంగాణా లో చాలా తక్కువ మంది మాత్రమే నమ్మారు. ఆంధ్రా నాయకులు చేస్తున్న దోపిడీ ని తట్టుకోలేక కావచ్చు మరేదైనా కారణం కావచ్చు తెలంగాణా వారికి ఆంధ్రా మీద ఇక్కడి ప్రజల మీదా పాజిటివ్ ఒపీనియన్ ఎప్పుడూ లేదు .. అది వారి తప్పు కాదు కూడా. ఆంధ్రా నాయకుల దోపిడీ ఆంధ్రా ప్రజల మీద కూడా ఇంపాక్ట్ చూపించింది అనేది నిజం. సరే విడిపోయారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు ? ఒకప్పుడు తెలంగాణా ఉద్యమ సమయం లో కోట్లాది ఆంధ్రా ప్రజలని అవహేళన చేసారు అనేది నిజం. ఇటునుంచి అటూ అటు నుంచి ఇటూ యుద్ధ వాతావరణమే నడిచింది గాక. హైదరాబాద్ ని అడ్డం పెట్టుకుని సీమాంధ్ర ప్రాంత ప్రజలనీ తీవ్రంగా అవమానించారు తెలంగాణా నాయకులు. కోట్లాది మంది ప్రజలని దొంగలు అనే అన్నారు. కానీ కట్ చేసి చూస్తే పరిస్థితి భలే గమ్మత్తుగా ఉంది. సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఒక్కరంటే ఒక్క వ్యపారస్తుడిని మాత్రం తెలంగాణా ప్రభుత్వం వెనక్కి పంపలేదు. తెలంగాణా ప్రభుత్వ కాంట్రాక్ట్ లు సైతం సీమాంధ్ర వ్యక్తులకే ఇస్తూ ఉండడం గమనార్హం. సీమాంధ్ర ప్రాంత రాజకీయ నాయకులతో తెలంగాణా నాయకుల స్నేహ హస్తాలు కూడా చాలా ఎత్తుకి చాచ బడ్డాయి. సీమాంధ్ర ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెప్పి సినిమావాళ్ళందరినీ కెసీఆర్, కెటీఆర్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ఇక్కడే ఉండండి అని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తున్నారు. ఉద్యమ సమయంలో దోపిడీదారులు అని ముద్రవేసిన వాళ్ళను తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సర్వాధికారాలను అనుభవిస్తున్న కెసీఆర్ ఎందుకు వెళ్ళగొట్టడం లేదు? తెలంగాణా సెంటిమెంట్ ని లేపడానికి మాత్రమే ఆంధ్రా ప్రాంత ప్రజలని దొంగలని చేసారు తప్ప నిజానికి వారి మీద ఎలాంటి కోపం లేదు తెలంగాణా వారికి , తెలంగాణా ప్రజలని రెచ్చగొట్టి తెలంగాణా రాకపోతే సమస్యే లేదు అనే ఫీలింగ్ సృష్టించడానికి ఈ రకమైన పరిస్థితి కల్పించారు. రామోజీఫిల్మ్ సిటీతో సహా సీమాంధ్రుల వ్యాపారాలన్నీ అమరావతికి వెళ్ళిపోతే తెలంగాణా రాష్ట్రం ఏ స్థాయిలో నష్టపోతుందో కెసీఆర్ ప్రభుత్వానికి తెలియదా? సీమాంధ్ర దోపిడీదారులు(అప్పట్లో అలాగే పిలిచారు మరి) వెళ్ళిపోతే తెలంగాణా కే నష్టం అనుకుంటున్నారా ? ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు అన్నీ కూలుస్తాం అంటూ ప్రతిజ్ఞ చేసినవారు ఇప్పటి దాకా కనపడిందే లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: