తమిళనాడు రాజకీయాల్లో ఎవరు ఎవరికి శత్రువుగా మారుతారో ఊహించడం కష్టంగా మారుతోంది. జయకు వీర విధేయుడిగా ఉన్న పన్నీర్ సెల్వం శశికళకు ఎదురు తిరిగాడు. అన్నా డీఎంకేకి, డీఎంకే కి క్షణం పడదు. అ లాంటిది పన్నీర్ స్టాలిన్ తో చేతులు కలుపుతాడా అనే ఊహాగానాల కూడా వచ్చాయి. దీనితో పన్నీర్ సెల్వం శశికళ వర్గానికి బద్ద శత్రువుగా మారిపోయాడు. శశికళ తన అనుచరుడైన పళని స్వామిని ముఖ్యమంత్రిని చేసిం ది. శశికళని అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు శాసన సభా పక్ష నేతగా ఎన్నుకోవడం దగ్గర నుంచి పళని స్వామి అసెం బ్లీలో బల పరీక్ష నెగ్గడం వరకు అంతా రెండు వారాల్లోపే జరిగిపోయింది.

దీనితో ప్రజా మద్దత్తు ఉండి కూడా పన్నీర్ సెల్వం ఎమ్మెల్యే ల మద్దత్తుని కూడగట్ట లేకపోయారు. దీనికి తోడు శశికళ ఎత్తులు వేసి పళని స్వామిని ముఖ్యమంత్రిని చేయడంతో పన్నీర్ కు నిరాశే మిగిలింది.దీనితో నేరుగా ప్రజల్లోనే తేల్చుకోవాలని ఆయన సిద్ధం అయ్యారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వ హించడానికి ఆయన సమాయత్తం అవుతున్నారు. దీని కోసం జయలలిత ఫొటోలతో ఉండే ప్రచార రధాన్ని కూడా పన్నీర్ వర్గం సిద్ధం చేసింది. మహీంద్రా జీపుని కొంత మార్పులు చేసి ఆయన ఈ ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు. 

శశికళ వైఖరిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ఆమె వర్గంపై వ్యతిరేకతని వ్యాపింప జేసి ప్రజలను పూర్తిగా తనవైపుకు తిప్పుకోవాలని పన్నీర్ భావిస్తున్నారు. పళనిస్వామి ప్రభుత్వం ఎక్కువరోజులు నిలబడదని సంకేతాలు అందు తున్న నేపథ్యంలో ముందుగా ప్రజల్లో తనపై మంచి అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు అసలైన అన్నా డీఎంకే తమదే అని పన్నీర్ సెల్వం వర్గం చెబుతున్నా, వీరి వైపు ప్రజా ప్రతినిధుల బలం లేకపోవడంతో దానిని ముందుకు తీసుకెళ్లలేకున్నారు.

మ‌రోవైపు... తాజాగా శ‌శిక‌ల సైతం ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామిని కూడా ఆమె నమ్మడం లేదా ? అంటే అవుననే సమాధా నాలు వినిపిస్తున్నాయి. శశికళ సుదీర్ఘంగా నాలుగేళ్ల పాటు జైలులో ఉండాలి. ఈ లోపు ఎలాంటి రాజ కీయ పరిణామాలైనా చోటు చేసుకునే అవకాశం ఉంది. నేడు పన్నీర్ సెల్వం ఎదురు తిరిగినట్లే రేపు పళని స్వామి పదవి కోసం ఎదురు తిరగడని గ్యారెంటీ ఏంటి ? అనే అనుమానం శశికళలో మొదలైనట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా అన్నా డీఎంకే పార్టీ తన గుప్పెట్లో ఉండాలంటే సీఎం కూడా తన బంధువే అయి ఉండాలి అని శశికళ భావిస్తోందట.

దీనికోసం తన అక్క కొడుకు దినకర్ ని ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తోందట. జైలు నుంచే దీనికి సంబం దించిన ప్రణాళికని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ వాదనకు బలం చేకూరేలా అన్నా డీఎంకే ఎమ్మెల్యే తం గుదురై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. త్వరలోనే దినకర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన పేర్కొ న్నారు.తంగుదురై వ్యాఖ్యలతో పళని స్వామి ముఖ్యమంత్రి పదవిని కోల్పోయే సమయం దగ్గర పడిందనే చర్చ జోరుగా సాగుతోంది. 

దినకర్ నే ముఖ్యమంత్రిని చేయాలని చిన్నమ్మ భావించే క్రమంలో పళనిస్వామి శశి కళకు ఎదురు తిరిగే అవ కాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ పరిణామాల్ని చూస్తుంటే సమీప భవిష్యత్తు లో తమిళ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే శశికళకు విరోధిగా మారిన పన్నీ ర్ తో పళని కలిసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: